Virat Kohli Restaurant In Hyderabad : హైద‌రాబాద్‌లో ఓపెన్ అయిన విరాట్ కోహ్లీ రెస్టారెంట్.. దీని స్పెష‌ల్ ఏంటంటే..!


Virat Kohli Restaurant In Hyderabad : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వస్త్రాలతోపాటు రెస్టారెంట్ల బిజినెస్ కూడా నిర్వ‌హిస్తున్నారు. విరాట్ కోహ్లీ వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, ఢిల్లీలో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేసిన కోహ్లీ.. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ప్రారంభించాడు ..హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్‌కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో ఈ రెస్టారెంట్ ను మే 24న ప్రారంభిస్తున్నట్లు కోహ్లీ తన ఇన్ స్టాలో వెల్లడించారు.

మీతో కొన్ని కొత్త విషయాలను షేర్ చేసుకోవడానికి సంతోషిస్తున్నాను. మేము ఇప్పటికే హైదరాబాదద్ హైటెక్ సిటీ నడిబొడ్డుకు వచ్చేశాం.. నాకు, one8 కమ్యూన్ అనేది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు . ఇది హైదరాబాద్‌లోనే ప్రజలను ఒకేచోటకు చేర్చడం మా ముఖ్య ఉద్దేశం అని అన్నారు. మొదటగా బెంగళూరులో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ ను స్టార్ట్ చేశాం..ఇపుడు హైదరాబాద్ లో స్టార్ట్ చేశామని కోహ్లీ బిజినెస్ పార్ట్ నర్ వర్తిక్ తిహార్ చెప్పాడు. కోహ్లీకి హైదరాబాద్ అంటే ఇష్టమని..ఇటీవలే ఆర్సీబీ తరపున మ్యాచులు ఆడాడాని.. వీలైతే మరి కొన్ని రోజుల్లో మరో రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడని తెలిపారు.

Virat Kohli Restaurant In Hyderabad do you know its specialty
Virat Kohli Restaurant In Hyderabad

వన్ 8కమ్యూన్ లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులతో మెనూ పెట్టామని చెప్పారు.ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యాని ఉంటుందన్నారు.కోహ్లీకి ఇష్టమైన మష్రూమ్ డిమ్ సమ్ అతడికి ఇష్టమని అన్నారు. విరాట్ రెస్టారెంట్ ను చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఇక వన్ 8 కమ్యూనల్ రెస్టారెంట్‌లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులతో మెనూ పెట్టామని ఆయన వెల్లడించారు. ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యానీ ఉంటుందని తెలిపారు. కోహ్లీకి మష్రూమ్ డిమ్ సమ్ అంటే ఇష్టమని కోహ్లీ బిజినెస్ పార్ట్నర్ నర్ వర్తిక్ తీహార్ తెలిపారు.కాగా కోహ్లీ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం టీ20 ప్ర‌పంచ్ క‌ప్ కోసం ప్రాక్టీసులు చేస్తూ బిజీగా ఉన్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *