Uday Kiran: కొన్ని ఏళ్ళు టాలీవుడ్ లో వరుస హిట్స్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా ఎదిగిన కొద్దీ మందిలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు.చిత్రం సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.తెలుగులో మనసంతా నువ్వే,కలుసుకోవాలని,నీ స్నేహం,నేను నీకు నాకు నువ్వు,అవునన్నా కాదన్నా అనే సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
అప్పట్లో ముఖ్యంగా యూత్ లో ఉదయ్ కిరణ్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది.అయితే యెంత త్వరగా స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడో అంతే త్వరగా అవకాశాలు లేక కుంగుబాటుకు గురయ్యాడు ఉదయ్ కిరణ్.2014 లో ఆత్మహత్య చేసుకొని అందరికి దూరం అయ్యాడు.ఉదయ్ కిరణ్ గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.ఇక ఇదే క్రమంలో అతనికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తాజాగా టాలీవుడ్ లో ఒక టాప్ సింగర్ ఉదయ్ కిరణ్ కు సోదరి అవుతుంది అనే ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఆమె బాహుబలి,భీమ్లా నాయక్ సినిమాలలో పాటలు పాడిన పర్ణిక మాన్య.ఈమె జీ తెలుగులో ప్రసారం అయినా సారిగామప షో తో తన కెరీర్ ను ప్రారంభించింది.ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.అయిగిరి నందిని సాంగ్ తో ఈమె అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.తెలుగులో పర్ణిక పరారే,బ్రహ్మనందం డ్రామా కంపెనీ,తెలుగమ్మాయి,బాడీ గార్డ్,దేనికైనా రెడీ,గ్రీకు వీరుడు,బాహుబలి,రభస,కవచం,భీమ్లా నాయక్ తో కలిపి 50 కు పైగా సినిమాలలో పాటలను పాడింది.ఒక ఇంటర్వ్యూ లో పర్ణిక మాట్లాడుతూ మా పెద్దమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ నాకు అన్నయ్య అవుతాడు అని చెప్పుకొచ్చింది.అన్నయ్య మంచి మనసు ఉన్న వ్యక్తి మా మధ్య మంచి అనుబంధం ఉండేది అంటూ పర్ణిక చెప్పుకొచ్చింది.అలాంటి వ్యక్తి దూరం అవ్వడం దురదృష్టం.అన్నయ్య పేరును నేను ఎప్పుడు ఇండస్ట్రీలో ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు అంటూ తెలిపింది పర్ణిక.
Source link