Train : థ‌ర్డ్ ఏసీ టికెట్ ఉన్నా లోప‌లికి ఎక్క‌లేని ప‌రిస్థితి.. ఒళ్లు మండి ఏం చేశాడంటే..!


Train : పండుగ‌లు వ‌స్తే రైళ్ల‌లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. రిజ‌ర్వేష‌న్ ఉన్నా కూడా జ‌నాల ర‌ద్దీ వ‌ల‌న మ‌న సీటు వ‌ర‌కు కూడా వెళ్ల‌లేని ప‌రిస్థితి. దీపావళి సందర్భంగా రైల్లో గుజరాత్‌లోని వడోదర నుంచి మధ్యప్రదేశ్‌లోని రత్లాం వెళ్తున్న అన్షుల్‌ శర్మ అనే ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. థర్డ్‌ ఏసీ టికెట్‌ బుక్ చేసుకున్నా, కంపార్ట్‌మెంట్ మొత్తం ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయింది. కనీసం లోపలికి అడుగు పెట్టడానికి వీలులేకుండా డోర్‌ దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. దీంతో ఆ వ్య‌క్తి రైల్వేపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.భారతీయ రైల్వే నుండి తన టిక్కెట్‌ డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగాడు.

ట్వీట్ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన అన్షుల్…రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ, ‘నాకు రూ.1173.95 పూర్తి వాపసు కావాలి’ అని అన్షుల్ రాశారు.అతను డీఆర్ఎం వడోదరను కూడా ట్యాగ్ చేశాడు. అన్షుల్ తన ట్వీట్‌లో కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేశాడు.ఇందులో స్టేషన్‌లో భారీ గుంపు కనిపిస్తుంది.‘నా దీపావళిని నాశనం చేసినందుకు ధన్యవాదాలు’ అని తన ట్వీట్‌లో రాశాడు.పోలీసుల సహాయం లేదని, రైలులో కాలు పెట్టేందుకు కూడా వీలు లేకుండా రిజర్వేషన్ కోచ్ లోకి ఎక్కార‌ని అన్నాడు. తనలాగే రైలు ఎక్కలేని వారు ఇంకా చాలా మంది ఉన్నారని తెలిపాడు.అతను ఇంకా ఇలా వ్రాశాడు, ‘కార్మికుల గుంపు నన్ను రైలు నుండి బయటకు విసిరింది. వారు తలుపులు మూసివేశారు.

Train what a passenger did even if he had 3rd ac ticket
Train

లోపలికి ఎవ‌రిని అనుమతించలేదు.ఇదంతా చూసి పోలీసులు నవ్వుతూ నాకు సహాయం చేయడానికి నిరాకరించారు.ఏసీ కోచ్‌లోనూ భారీగా జనం ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతకు ఏం చర్యలు తీసుకున్నారు’ అని యాజమాన్యంపై ప్రశ్నలు సంధించారు.అన్షుల్ ట్వీట్‌కు డీఆర్ఎం వడోదర నుంచి రిప్లై వచ్చింది. మెరుగైన సహాయం కోసం వివరాలను అందించాలని కోరారు.అతడికి లైఫ్ టైమ్ ఫ్రీ జర్నీ అందించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అన్షుల్ దెబ్బ‌కి రైల్వే దిగి వ‌చ్చింద‌ని చెప్పాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *