RGV : కుక్క‌ల్ని ప్రేమించివాళ్ల‌ని విడిచిపెట్టొద్దు.. వారిపై ట్యాక్స్ వేయాల్సిందే..


RGV : ఎప్పుడు వివాద‌ల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల అంబర్ పేట వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ప్రదీప్ కుటుంబం త‌ర‌పున గ‌ట్టి పోరాట‌మే చేస్తున్నాడు. త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా అటు ప్రభుత్వాన్ని, ఇటు జంతు ప్రేమికులను.. మధ్యలో వచ్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మిని.. ట్వీట్లతో ఏకిపారేశారు. ఈ ఎపిసోడ్‌లో ఆర్జీవీ తన మార్క్ ట్వీట్లే చేసినప్పటికీ.. వాటిల్లో ఎక్కడో ఓ మూల హ్యూమన్ యాంగిల్ అయితే తొంగి చూసింది. మానవతా ధృక్పథం అంటే మీనింగ్ నాకు తెలియదు అంటూ సెటైర్లు వేసే ఆర్జీవీ.. ఈ ఎపిసోడ్‌లో మాత్రం ముందు నుంచి బాధిత కుటుంబ తరఫున తన గొంతు వినిపిస్తూనే ఉన్నాడు.

రీసెంట్‌గా చిన్నారి కుటుంబానికి సాయం చేయండి అంటూ బ్యాంక్ అకౌంట్ నంబర్ ను సైతం సోషల్ మీడియాలో పెట్టారు వర్మ.ఇక తాజాగా కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయాలి అంటూ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చాడు. ”కుక్కల‌ సంఖ్యను నియంత్రించడానికి ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఉన్న కుక్కలన్నింటిని పట్టుకుని వాటిని ఒక దగ్గర చేర్చి, వాటికి కొన్ని నెంబర్లనో, పేర్లనో పెట్టి జంతు ప్రేమికులకు ఇవ్వండి. లేదా కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వ‌ర్మ‌. ఒక‌వేళ అది కుద‌ర‌ని ప‌క్షంలో మేయర్ గానీ, అంతకంటే కింది స్థాయి వ్యక్తులు గానీ ఎవరైనా తమ ఆస్తిని కొడుకులకు కాకుండా కుక్కల పెంపకానికి రాసివ్వమనండి అంటూ కాస్త సెటైరిక‌ల్ కామెంట్ చేశారు.

RGV said put tax on those who love dogs
RGV

రాజ్యాంగ ప్ర‌కారం, చట్టబద్దంగా టాక్స్ వేస్తే నేను కట్టడానికి రెడీ అని వర్మ తెలిపారు. అంతేగాని ఊరికే అడిగితే నేను డబ్బులు ఇవ్వను అని అన్నాడు. ఇక కుక్కల్ని ప్రేమిస్తున్నాం అంటూ తహతహలాడే వారందరికి త‌ప్ప‌క ట్యాక్స్ వేయాలంటూ రామూజీ ఓ ఉచిత స‌లహా అయితే ఇచ్చాడు. వర్మ నుంచి ఇలాంటి పరిణామం చూసి.. తన పేరు చెబితేనే చీదరించుకునే వాళ్లతో కూడా.. సార్.. మీరు మారిపోయారు సార్.. అనే డైలాగ్ చెప్పేలా చేశాడు ఆర్జీవీ. ఇక బాధితుడి కుటుంబానికి అండగా ఉండాలన్న ఆర్జీవీ అభ్యర్థనకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

The post RGV : కుక్క‌ల్ని ప్రేమించివాళ్ల‌ని విడిచిపెట్టొద్దు.. వారిపై ట్యాక్స్ వేయాల్సిందే.. appeared first on Telugu News 365.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *