RCB : ఆర్సీబీ ప్లే ఆఫ్‌కి చేరుతుందా.. గ‌ణాంకాలు ఏం చెబుతున్నాయి..!


RCB : ఐపీఎల్ 2024 చాలా హోరాహోరీగా సాగుతుంది. ఈ సారి ప్ర‌తి జ‌ట్టు కూడా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుంది. అయితే ముంబై, ఆర్సీబీ లాంటి జ‌ట్లు మాత్రం చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డం ఫ్యాన్స్‌ని నిరుత్సాహ‌ప‌రుస్తుంది. అయితే ప్ర‌తి సీజ‌న్‌లో ఆర్సీబీ జ‌ట్టు బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ ఎందుకో ఆ జ‌ట్టు చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌దు.ఈ సారి కూడా ఆ జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైనట్లే. ఈ సీజన్ లో ఆర్సీబీ మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్ లలో ఆ జట్టు ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబీ జట్టునుండి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తాత్కాలికంగా వైదొలుగుతున్నాడు.

ఇప్పటికే ఈ విషయాన్ని అతను ఆర్సీబీ జట్టు కెప్టెన్ డు ప్లెసిస్, కోచ్ కు చెప్పాడు. హైదరాబాద్ మ్యాచ్ కంటే ముందే ఈ విషయాన్ని మాక్స్‌వెల్ వారికి చెప్పడంతో అతని స్థానంలో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విల్ జాక్స్ ను తుది జట్టులో చేరారు. ఇక ఆరు ఓటములను మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచిన ఆర్సీబీ జట్టు నెట్ రన్ రేటు మైనస్ 1.185గా ఉంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మిగిలివున్న అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అది కూడా ఇత‌ర టీమ్‌ల‌పైన ఆధార‌ప‌డి ఉంటుంది. అద్భుతం జ‌రిగితేనే ఆర్స‌బీ ప్లేఆఫ్‌కి చేరుతుంంది. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందేనని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

can RCB go to playoffs or what studies and stats saying
RCB

ఇక జ‌ట్టుకి మెయిన్ పిల్ల‌ర్‌గా ఉన్న మ్యాక్స్‌వెల్ ఇటీవ‌ల వ‌రుస మ్యాచ్‌ల‌లో నిరాశ‌ప‌ర‌చ‌డం వారికి పెద్ద దెబ్బ అయింది. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోర పరాజయం తర్వాత మాక్స్‌వెల్ మీడియాతో మాట్లాడాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయాను.. పవర్ ప్లే తర్వాత మా జట్టు వైఫల్యాలు ఎదుక్కొంటుంది.. బ్యాట్ తో నా ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అప్పుడే నేను ఫిట్ గా తిరిగొస్తా. నేను కేవలం తాత్కాలికంగానే టోర్నీకి దూరమవుతున్నా.. టోర్నీలో ఆర్సీబీ జట్టుకు నా అవసరం ఎప్పుడొచ్చినా బలంగా తిరిగొస్తానని మాక్స్‌వెల్ చెప్పాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *