Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు మన దేశం తో పాటు విదేశాలలో కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా ఆయన సినిమాలు జపాన్ లో బాగా ఆడతాయి అని చెప్పచ్చు.రజనీకాంత్ సినిమాలు ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.ఆయన నటించిన చివరి సినిమా అన్నత్తే ఫ్యాన్స్ నిరాశ పరిచిందని చెప్పచ్చు.భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరాజయం పొందడంతో ఆయన అభిమానులు రజనీకాంత్ తరువాతి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సినిమా ఇండస్ట్రీలో చాల మంది స్టార్లు ఉన్న సూపర్ స్టార్ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చే పేరు రజనీకాంత్ అని చెప్పచ్చు.ఇప్పటి వరకు చాల మంది కొత్త హీరోలు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కూడా రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ ను బీట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు అని తెలుస్తుంది.
ఇప్పటికి కూడా చాల రికార్డులు రజనీకాంత్ కు సొంతం అని చెప్పచ్చు.ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న మొదటి సౌత్ హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ కు రికార్డు ఉంది.ఈయన సినిమాలు విదేశాలలో ముఖ్యంగా జపాన్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.అయితే ఆయన నటించిన సినిమా అన్నత్తే ప్రేక్షకులను నిరాశపరచడంతో ఆయన అభిమానులు ఆయన నెక్స్ట్ సినిమా జైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాకు ముందు దిలీప్ దళపతి విజయ్ తో బీస్ట్ సినిమాను తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందింది.దాంతో ఆయన అసలు అన్ని జైలర్ సినిమా మీద పెట్టుకున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 10 న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీస్ అయినా ట్రైలర్ యు ట్యూబ్ ను షేక్ చేస్తుంది.ఈ సినిమా బడ్జెట్ గురించి కూడా ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాను 225 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు అని సమాచారం.
అయితే ఈ సినిమా కోసం రజనీకాంత్ 110 కోట్లు పారితోషకం అందుకున్నారని వార్త వినిపిస్తుంది.ఇప్పటికే భారీ రెమ్యూనరేషన్ అందుకున్న పాన్ ఇండియా స్టార్లలో ప్రభాస్,దళపతి విజయ్ ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమాతో రజనీకాంత్ 100 కోట్లు రెమ్యూనరేషన్ మార్కును టచ్ చేసారు.రజనీకాంత్ సినిమా అంటే సులభంగా 500 కోట్లు రాబడుతుంది.ఇక త్వరలో రిలీస్ అయ్యే జైలర్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుంది అని సినిమా యూనిట్ తో పాటు ఆయన అభిమానులు కూడా ఆశిస్తున్నారు.
Source link