Producer Chitti Babu : ఏపీలో అంచనాలు అన్ని తలక్రిందులు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఘోర పరాజయం పాలైంది.. కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. ఈ ఘోర ఓటమికి గల కారణాలేంటి..? ఎక్కడ తప్పిదం జరిగింది.. వైసీపీని ఓడించిన విధానాలేంటి? ఓటర్లను ప్రభావితం చేసిన అంశాలేంటి..? ఇలా ఎన్నో విషయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.అయితే ఓటమి తర్వాత పార్టీకి సంబంధించిన ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడం ఆసక్తిని రేపుతుంది. 11 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జగన్ ఓడిపోవాలని, ఓడిపోతాడని కోరుకున్నవాళ్లు కూడా ఇంత ఘోరంగా ఓడిపోతాడని ఊహించలేదు.
సర్వేలు, ముందస్తు అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ ఏవీ కూడా జగన్‌ని జనం ఇంతగా తిరస్కరిస్తారని చెప్పలేదు. టైఫ్ ఫైట్ ఖాయమని లేదంటే జగన్‌కు తక్కువలో తక్కువ 50 నుంచి 60 సీట్లు వస్తాయని తెలిపాయి. ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి జగన్ అభిమానులే కాదు, ప్రజలు కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈసారి బలం పుంజుకుని బలంగా బౌన్స్ బ్యాక్ అవుతామని , జగన్‌కు అండగా ఉంటామని వైసీపీ కేడర్, మద్ధతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే వైసీపీ ఓడిపోయిన క్షణం నుంచి కూటమి కేడర్ సామాజిక మాధ్యమాల్లో జగన్ పార్టీపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా మంత్రులు, ఇతర కీలక నేతలు గతంలో మాట్లాడిన మాటల తాలూకా వీడియోలను బయటకు తీసి వాటికి కౌంటర్ ఇస్తున్నాయి.
కొన్ని చోట్ల తెలుగుదేశం శ్రేణులు రెచ్చిపోతున్నాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమను ఐదేళ్లు కేసులు పెట్టి వేధించారని, దౌర్జన్యం చేశారని వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే నిర్మాత చిట్టిబాబు ఓటమిపై స్పందించారు. మార్పు కావలనే ప్రజలు జగన్‌ని ఓడించారని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి కూడా మార్పు వలన సాధ్యం కాలేదు. ఇప్పుడు ఏపీలో కూడా మార్పు కోసం జగన్‌ని ఓడించారని చిట్టిబాబు అన్నారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Source link