Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తిరుగులేని స్టార్ గా ఎదిగి ప్రత్యేక గుర్తింపును క్రేజ్ ను సంపాదించుకున్నారు.పవన్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు.పవన్ కు మొదట్లో ఎక్కువగా డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఉండేదట.అన్నయ్య ఎలాగో పెద్ద స్టార్ హీరో,అలాగే చిన్న అన్నయ్య ఎలాగో నటుడు మరియు నిర్మాత కాబట్టి వాళ్ళకి సంబంధించిన పలు సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారట పవన్ కళ్యాణ్.
తన పెద్ద అన్నయ్య అయినా చిరంజీవి దగ్గరకు కథ చెప్పడానికి వచ్చిన దర్శక నిర్మాతలకు మనం ఎలాంటి సినిమా తీసిన కూడా అది డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలూ రాకుండా జాగ్రత్త పడాలి..అలాగే ఫ్యాన్స్ కు నచ్చే ఎలెమెంట్స్ అందులో మిస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేవారట.ఇక తన వదిన సురేఖ మాట విని హీరోగా ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మొదటి సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నారు.మొదటి సినిమాలో రిస్క్ తో ఉన్న ఫీట్ లు చేయడంతో యూత్ మొత్తం పవన్ కు అట్ట్రాక్ అయిపోయారు.ఆ తర్వాత గోకులంలో సీత,సుస్వాగతం సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు పవన్.

ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ సినిమా పవన్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు.ఆ తర్వాత వచ్చిన తమ్ముడు సినిమాతో కూడా మరోసారి హిట్ అందుకున్నారు.బద్రి సినిమాతో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు పవన్.

ఖుషి సినిమా కూడా ఈయన కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ క్లాసికల్ అని చెప్పచ్చు.జల్సా సినిమా తర్వాత వరుసగా ప్లాప్ లు పడిన గబ్బర్ సింగ్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ఇక ఆ తర్వాత త్రివిక్రమ్,పవన్ కాంబినేషన్ లో 2013 లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంబంధించిన కొన్ని రేర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The post Pawan Kalyan: ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చూసి ఉందని పవన్ కళ్యాణ్ రేర్ ఫొటోస్… appeared first on HelloBDNewz – Latest Telugu News, Movies, AP, Telangana.
Source link