
NTR30 update | ఆర్ ఆర్ ఆర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఇంకా మొదలు కాలేదు. ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కొరటాల గత చిత్రం ‘ఆచార్య’ భారీ డిజాస్టర్ కావటంతో ఆ సెటిల్మెంట్ల రచ్చ ఇంకా తేలలేదని, తద్వారా ఎన్టీఆర్ సినిమా లేట్ అవుతుందని చాలాకాలం నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.
ఇందులో ఎంతోకొంత నిజం లేకపోలేదు. అయితే అదొక్కటే సినిమా ఆలస్యానికి కారణం కాదు. ఆమధ్య పూజా కార్యక్రమం ప్లాన్ చేసుకుని, అలియా భట్ రావట్లేదని పోస్ట్ ఫోన్ చేసారు. కట్ చేస్తే ….పెళ్లి వంకతో ఆలియా తప్పుకుంది. దీంతో హీరోయిన్ సమస్య తలెత్తింది. అప్పట్లోనే కొరటాల జాన్వీ కపూర్ ను ఫైనల్ చేసాడని వార్తలొచ్చాయి. ఈమధ్యే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక అసలు విషయానికి వస్తే….
పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఇతర బాషల నటులను కూడా వీలైనంత వరకు క్యాస్ట్ చేయనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సైఫ్ అలీ ఖాన్ ను విలన్ గా ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరో హీరోయిన్ కు స్కోప్ ఉందని, కృతి శెట్టి ని మరో హీరోయిన్ గ ఫిక్స్ చేసారని ఫిలిం నగర్ టాక్. అలాగే టైటిల్ గా ‘దేవర’ అని ఫిక్స్ చేసారని కూడా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు అన్నిటిని, ర్యూమర్లుగానే భావించాలి.
Source link