Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ సినిమా ‘చిరుత’ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. ఈ సినిమా 2007 లో విడుదల కాగా, ఈ మూవీ తర్వాత వరుణ్ సందేశ్ తో ‘కుర్రాడు’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. దీంతో 2010 లో ‘క్రూక్’ అనే హిందీ సినిమాలో నటించింది. ఇక అప్పటి నుంచి హిందీ సినిమాలే ఎక్కువగా చేసిందీ బ్యూటీ. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ సినిమాతో మళ్లీ ఈ బ్యూటీ టాలీవుడ్ లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది.
చిరుత’ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికు నేహాకు మంచి అవకాశాలు వచ్చాయి. కానీ కెరీర్‌లో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఈమెకు ఛాన్సులు రాకుండా చేసాయి. కుర్రాడు లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత నేహా శర్మను కనీసం పట్టించుకోలేదు మన నిర్మాతలు. సినిమాల్లో అవకాశాలు వచ్చినా రాకపోయినా తాను మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేయడం మాత్రం ఆపడం లేదు నేహా శర్మ. ఇది ఎప్పట్నుంచో చేస్తుంది.ఇప్పటికీ ప్రతీ వారం కచ్చితంగా కొత్త ఫోటోషూట్ చేస్తూనే ఉంటుంది నేహా శర్మ. బికినీతో సహా అన్ని ఫోటోషూట్స్ చేసుకుంటూ అదరహో అనిపిస్తుంది. ఈ హాట్ ఫోటోస్ చూసిన తర్వాత అందరూ వారెవ్వా అంటున్నారు.
తాజాగా నేహా శర్మ స్టన్నింగ్ లుక్స్ లో మెరసింది. నేహా కేక పెట్టించిన లుక్స్ కుర్రాళ్లకి మతి పోగొడుతున్నాయి. వెరైటీ డ్రెస్‌లో మతి పోగొట్టే అందంతో నేహా శర్మ లుక్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం నేహా లుక్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి. నేహా శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 20 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె 21 నవంబర్ 1987లో బిహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్‌లో జన్మించింది. ఈమెకు అయిషా శర్మ, రీతికా శర్మ సోదరిమణులున్నారు.
Source link