Mokshagna: బాలయ్య భగవంత్ కేసరి సెట్ లో సందడి చేసిన మోక్షజ్ఞ…ఫోటోలు వైరల్


Mokshagna

Mokshagna: ఈ ఏడాది సంక్రంతి కి నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.ఇక బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా భగవంత్ కేసరి సినిమా సెట్ లో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సందడి చేసారు.ఇక వీటికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సినిమా సెట్ లో వచ్చిన మోక్షజ్ఞ తో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా విషయాలను గురించి పంచుకున్నట్లు తెలుస్తుంది.

ఇక బ్లాక్ కలర్ డ్రెస్ లో బ్లాక్ గాగుల్స్ లో మోక్షజ్ఞ లుక్ బాగుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.అయితే గత కొంత కాలంగా టాలీవుడ్ లో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి జోరుగా కొన్ని వార్తలు వినిపించాయి.ఇక నందమూరి బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.మోక్షజ్ఞ మొదటి సినిమాను ఒక బడా డైరెక్టర్ చేతిలో బాలయ్య పెట్టబోతున్నట్లు సమాచారం.నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వచ్చి దాదాపుగా 18 సంవత్సరాలు అయ్యింది.ఇక నందమూరి బాలకృష్ణ తనయుడు ఆదిత్య 369 కు సీక్వెల్ ఆదిత్య 999 మాక్స్ మూవీ తో హీరో గా ఎంట్రీ ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

దాంతో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో భారీగా అంచనాలను నెలకొంది.సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య అందరిని ఆకట్టుకున్నారు.ఇక ఈ సినిమాలో డైలాగ్స్ కూడా బాగా పేలాయని చెప్పచ్చు.మరోసారి మాస్ ఓరియెంటెడ్ సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు రానున్నారు.అడవి బిడ్డ..నెల కొండా భగవంత్ కేసరి అని బాలయ్య చెప్పే డైలాగ్ ప్రేక్షకులలో గూస్ బంప్స్ ను తెప్పిస్తుంది.ఇక టీజర్ విడుదల తర్వాత ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.ఈ సినిమాతో బాలయ్య మరొక హిట్ అందుకోవడం ఖాయం అని అభిమానులు చెప్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఇక మరొక హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య కూతురిగా నటిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *