Kalyan Ram Family: నందమూరి కళ్యాణ్ రామ్ భార్య,పిల్లలను ఎప్పుడైనా చూసారా…క్యూట్ ఫ్యామిలీ…పిక్స్ వైరల్


Kalyan Ram Family

Kalyan Ram Family: నందమూరి కళ్యాణ్ రామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.నందమూరి తారకరామారావు మనవడిగా,నందమూరి హరికృష్ణ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కళ్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభం నుంచే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.హీరోగా రాణిస్తూనే నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత గా కూడా సక్సెస్ అయ్యారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ విషయం ఎలా ఉన్న మంచి క్రేజ్ ఉన్న మంచి హీరో అనే కళ్యాణ్ రామ్ కు ఉంది.ఈ క్రమంలోనే ప్రతి హీరో అభిమాని కూడా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలను ఇష్టపడుతుంటారు.అతనొక్కడే,పటాస్,118 ఇలా పలు సూపర్ హిట్ సినిమాలు కళ్యాణ్ రామ్ ఖాతాలో ఉన్నాయి.బింబిసార వంటి వైవిధ్యమైన కథతో సూపర్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్.తన పర్సనల్ లైఫ్ గురించి మీడియా కి దూరం గా ఉంచుతారు కళ్యాణ్ రామ్.

అయితే ఇటీవలే సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో కళ్యాణ్ రామ్ తన భార్య స్వాతి,కొడుకు సౌర్య రామ్,కూతురు తారక అద్విత లతో కలిసి దిగారు.చూడడానికి చాల క్యూట్ గా ఉన్న కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.కళ్యాణ్ రామ్ కొడుకు ఎంతో అందంగా అలాగే కూతురు అచ్చం అమ్మలాగే అందంగా ఉంది.కళ్యాణ్ రామ్,స్వాతి ల పెళ్లి 2006 లో జరిగింది.తాజాగా అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *