Dhanush Sir Movie Review : ధ‌నుష్ సార్ మూవీ రివ్యూ.. హిట్ కొట్టిన‌ట్టేనా..?


Dhanush Sir Movie Review : ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే స్టార్ హీరోలలో ధనుష్ ఒకరు. ఇత‌నికి త‌మిళంలోనే కాకుండ‌గా తెలుగులోను విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డైరెక్టర్ వెంకీ అట్లూరితో ‘సార్’ సినిమా చేయ‌గా, ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విద్యావ్యవస్థపై గురిపెడుతూ ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం! చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. బాల గంగాధ‌ర్ తిల‌క్ (ధ‌నుష్‌) ఓ లెక్చ‌ర‌ర్‌. డ్రైవ‌ర్ కొడుకైన అత‌డు క‌ష్ట‌ప‌డి చ‌దివి ఉద్యోగం సంపాదిస్తాడు. త్రిపాఠి విద్యాసంస్థ‌ల ఛైర్మ‌న్ శ్రీనివాస్ త్రిపాఠి (స‌ముద్ర‌ఖ‌ని) కాగా, ఆయ‌న రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ద‌త్త‌త తీసుకుంటాడు.

త్రిపాఠి కాలేజీలో ప‌నిచేసే బాల గంగాధ‌ర్ తిల‌క్ సిరిపురం అనే ఊరిలోని ప్ర‌భుత్వ కాలేజీకి వెళ‌తాడు. త‌మ లెక్చ‌ర‌ర్ల‌తో చ‌దువు స‌రిగా చెప్పించ‌కుడా ప్ర‌భుత్వ కాలేజీల‌ను పూర్తిగా దెబ్బ‌తీయాల‌ని త్రిపాఠి ప్లాన్ చేస్తాడు. కానీ అత‌డి ప్లాన్‌ను త‌ల‌క్రిందులు చేస్తూ బాల గంగాధ‌ర్ తిల‌క్ చ‌దువు చెప్పిన సిరిపురం ఊరిలోని స్టూడెంట్స్ ఫ‌స్ట్ క్లాస్‌లో పాస్ అవుతారు. త్రిపాఠి, బాల‌గంగాధ‌ర్ తిల‌క్ మ‌ధ్య జ‌రిగిన స‌న్నివేశాలు ఎలా ఉన్నాయి. సిరిపురం ఊరి నుంచి బాలును ఊరి ప్రెసిడెంట్ (సాయికుమార్‌)ఎందుకు బ‌హిష్క‌రించాడు.. ల‌క్ష్యాన్ని చేరుకున్నాడా అనేది సినిమా క‌థ‌.

Dhanush Sir Movie Review in telugu know how is it
Dhanush Sir Movie Review

విద్యావ్యవస్థలో జరుగుతున్న అరాచకాలు.. స్టూడెంట్స్, ముఖ్యంగా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలు సినిమాలో చ‌క్క‌గా చూపించారు. అదే టైంలో పదునైన డైలాగ్స్ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. హిందీలో హృతిక్ రోషన్ చేసిన ‘సూపర్ 30’ మూవీ కూడా ఇలానే ఉంటుంది. ధనుష్ నటన గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటిలాగే చించేసాడు. కాకపోతే ధనుష్ నుండి కొత్త రకం యాక్టింగ్ ఐతే బయటికి రాబట్టలేదు. సంయుక్త మీనన్.. సముద్రఖని.. ఇలా మిగతా క్యారెక్టర్స్ కి ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఆకట్టుకుంటారు. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైట్స్.. లవ్ సీన్స్ కూడా ఉన్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. వెంకీ ఎంచుకున్న సబ్జెక్టుకి ధనుష్ తో న్యాయం చేయించుకున్నాడు. ఎమోష‌న‌ల్ మెసేజ్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌నే చెప్పాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *