CM YS Jagan : సీఎం జ‌గ‌న్‌కి పెద్ద షాకిచ్చిన హైకోర్ట్.. ఏం జ‌రిగింది..?


CM YS Jagan : ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక ఆర్ధిక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ పిల్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. సీఎం వైఎస్ జగన్ తో పాటు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్ కు విచారణార్హత లేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించినా హైకోర్టు మాత్రం నోటీసులు జారీ చేసింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని పథకాలు కూడా ఏపీలో ఉన్నాయి. అయితే వీటి వెనుక ఆర్ధిక అక్రమాలు జరుగుతున్నాని, వాటిపై సీబీఐ విచారణ జరిపించి దోషుల్ని శిక్షించాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిల్ చేసిన విష‌యం తెలిసిందే. దీన్ని విచారించే విషయంలో ప్రభుత్వం తరఫున హాజరైన ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం అభ్యంతరం తెలిపారు. అసలు ఈ పిల్ కు విచారణార్హత లేదని వాదించారు. అయితే హైకోర్టు మాత్రం రఘురామ పిల్ లో పేర్కొన్న 41 మంది ప్రతివాదులకు నోటీసులు పంపింది.

CM YS Jagan got notices from high court
CM YS Jagan

మరోవైపు రఘురామ దాఖలు చేసిన పిల్ విచారించే అంశంపై ఆయన తరఫు న్యాయవాది కూడా త‌మ‌దైన శైలిలో వాదనలు వినిపించారు. రఘురామ పిల్ దాఖలు చేశారని తెలియగానే ప్రభుత్వం వీటికి సంబంధించిన రికార్డులు ధ్వంసం చేసిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం ఈ పిల్ పై విచారణను వచ్చే నెల 14కి వాయిదా వేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *