Chiranjeevi Gang Leader Movie : గ్యాంగ్ లీడ‌ర్ సినిమా చిరంజీవి క‌న్నా ముందు ఆ హీరో వ‌ద్దకు వెళ్లిందా..?


Chiranjeevi Gang Leader Movie : మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రాల‌లో గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం ఒక‌టి. అప్పటికే నెంబర్ వన్ హీరోగా, మెగాస్టార్ గా ఉన్నా.. ఈ సినిమా సాధించిన సంచలన విజయం చిరంజీవిని తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. చిరంజీవి ఓ రేంజ్‌తో దూసుకుపోతున్న స‌మయంలో వ‌చ్చిన ఈ చిత్రం మాస్, ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కింది.ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్, మాస్ మేనరిజమ్స్, స్టయిల్, డైలాగ్ డిక్షన్.. అభిమానులకు పూన‌కాలు తెప్పించాయి.

నలుగురు స్నేహితులకు లీడర్ గా, పెద్ద కుటుంబానికి దిక్కుగా.. చిరంజీవితో నట విశ్వరూపం చూపించారు దర్శకుడు విజయబాపినీడు. మొదట బాపినీడు ఈ కథను చిరంజీవికి చెప్తే పెద్దగా నచ్చలేక పక్కన పెట్టారట. అయితే.. పరుచూరి బ్రదర్స్ స్వయంగా ఈ విషయం తెలుసుకుని బాపినీడు గారితో మూడు రోజులు టైమ్ అడిగి మార్పులు చేసి మళ్లీ చిరంజీవికి వినిపిస్తే.. అద్భుతం.. సినిమా చేద్దామన‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అయితే ఈ సినిమా చిరంజీవి క‌న్నా ముందు చిరంజీవి త‌మ్ముడు నాగేంద్ర‌బాబు వ‌ద్దకు వెళ్లింద‌ట‌. చిరంజీవి స్టార్ హీరోగా ఉన్న స‌మ‌యంలోనే త‌న పెద్ద త‌మ్ముడు నాగ‌బాబుని హీరోగా ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేశాడు.

Chiranjeevi Gang Leader Movie who rejected it first
Chiranjeevi Gang Leader Movie

చిరంజీవి న‌టించిన‌ కొండ‌వీటి దొంగ సినిమాలో నాగ‌బాబు న‌ట‌న‌ను చూసి ప‌రిచూరి బ్ర‌ద‌ర్స్‌.. నాగ‌బాబు హీరోగా అరే ఓ సాంబ అనే టైటిల్ తో ఓ ప‌వ‌ర్ పుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. కొత్త హీరో కావ‌డంతో నిర్మాత‌లు ఎవ‌రు ముందుకు రాలేదు. అప్పుడు ఈ క‌థ‌ని త‌న అన్న చిరంజీవితో చేయ‌మ‌ని నాగ‌బాబు స‌లహా ఇచ్చాడు. అప్పుడు ద‌ర్శ‌కుడు బాపినీడు చిరంజీవి వ‌ద్ద‌కు వెళ్లి క‌థ‌ని వినిపించ‌గా కొన్ని మార్పులు చేర్పులు చేసి టైటిల్ ని కూడా మార్చాడ‌ని సూచించాడ‌ట‌. అరే ఓ సాంబ క‌థ‌ను చిరంజీవి కోసం గ్యాంగ్ లీడ‌ర్ గా మాస్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే విధంగా తీర్చిదిద్దారు బాపినీడు. అలా ఈ సినిమా చిరంజీవి చేతికి రావ‌డం మూవీ పెద్ద హిట్ కావ‌డం జ‌రిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *