Childhood Pic: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలోని నటి నటుల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి వాళ్ళ లేటెస్ట్ సినిమాల అప్ డేట్స్ వరకు అన్ని కూడా వైరల్ అవుతూ ఉంటాయి.అభిమానులు కూడా తమకు ఇష్టమైన నటి నటుల గురించి తెలుసుకోవడానికి వాళ్ళ చిన్ననాటి ఫోటోలు చూడడానికి బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.నటి నటులు కూడా ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ అభిమానులతో తమ చిన్ననాటి ఫోటోలను పంచుకుంటూ ఉంటారు.
సెలెబ్రెటీలు షేర్ చేసిన ఫోటోలు చాల తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతాయి.తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ గా కొనసాగుతున్న యాంకర్ కూడా తన చిన్ననాటి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.రెండు జాడలు వేసుకొని క్యూట్ గా నవ్వుతున్న ఈ చిన్నారిని కనిపెట్టడానికి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ఆమె మరెవరో కాదు బుల్లితెర మీద తన యాంకరింగ్ తో అందరిని మెస్మరైస్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో నటిగా చేస్తూ అందరిని అలరించే యాంకర్ సుమ కనకాల.సుమ తన వాక్ చాతుర్యంతో తీరిక లేకుండా సినిమా ఈవెంట్లు,ప్రీ రిలీజ్ ఈవెంట్లు,టీవీ షోలు ఇలా పలు కార్యక్రమాలు చేస్తూ బిజీ గా గడుపుతుంది.
తన మాట తీరుతో అందరిని ఆకట్టుకోవడంలో యాంకర్ సుమ తర్వాతే ఎవరైనా అని చెప్పచ్చు.ఈమె డేట్స్ కోసం టాలీవుడ్ లో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అందరు వెయిట్ చేస్తూ ఉంటారు.తమ సినిమా ఈవెంట్ కు సుమ యాంకరింగ్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చాల మంది నమ్ముతారు.
View this post on Instagram
Source link