Child Artist: చిట్టినాయుడు పెద్దవాడయ్యాడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..?


Child Artist: చిట్టినాయుడు.. అదేనండి చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ అందరికీ గుర్తుండే ఉంటుంది. రెడీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. ఈ సినిమాకు నంది అవార్డు సైతం అందుకున్నాడు. బిందాస్‌ సినిమాకు సైతం నంది అవార్డు వరించింది. ఢీ, పెదబాబు, కింగ్, గుడుంబా శంకర్, పోకొరి, హ్యాపీ, దుబాయ్ శీను, అందాల రాముడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన కామెడీతో కేక పుట్టిస్తూ ప్రేక్షకులకు హాస్యాన్ని పంచాడు. 80కిపైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నాడు. స్టడీస్ కోసం కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న భరత్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమాలో సెకండ్ హీరో పాత్ర పోషించారు. ఆ తరువాత మరో సినిమాలోనూ నటించాడు. అయితే ప్రస్తుతం భరత్ సినిమాల్లో కనిపించడంలేదు.

కామెడీ టైమింగ్, అద్భుతమైన నటనతో వెండితెరపై చక్కిలిగింతలు పెట్టిన భరత్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న భరత్ రీ ఎంట్రీ అంత సక్సెస్ ఫుల్‌గా లేదనే చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో అవకాశాలు వచ్చినా ప్రస్తుతం తగ్గిపోయాయి. కొన్ని రోజులుగా ఆయన సినిమాలేవీ విడుదల కాలేదు. ఆఫర్లు రావడంలేదని తెలిసింది. చిన్నప్పుడు ముద్దుగా.. బొద్దుగా ఉండే భరత్ ప్రస్తుతం సిక్స్ ప్యాక్‌తో హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఏబీసీడీతోపాటు ఆచారి అమెరికా యాత్ర, దూసుకెళ్తా, ఇద్దరి లోకం ఒక్కటే తదితర చిత్రాల్లో మెరిసాడు. అల్లు శిరీష్‌తో కలిసి నటించిన మూవే అతని చివరి సినిమా. ఆ తరువాత మరో సినిమా కనిపించలేదు.

Also Read : గీత గోవిందం నటి.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా..లేటెస్ట్ ఫోటోలు వైరల్

మూవీస్‌కు క్రమంగా దూరం కావడంతో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండడంలేదు. కొద్ది రోజులుగా ఇన్‌స్టాలోనూ పోస్టులు పెట్టడంలేదు. అయితే భరత్ లేటెస్ట్ ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మూడేళ్లకే ఇండస్ర్టీ బాట పట్టిన భరత్ ఇప్పుడు మెడిసిన్ పూర్తి చేసినట్లు సమాచారం. కాలేజీ రోజుల్లో జరిగిన ప్రమాదంలో భరత్ కన్నుకు తీవ్ర గాయమైందని తెలిసింది. దీంతో ఒక కన్ను పనిచేయడంలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చాలా కాలంగా కంటి అద్దాలు పెట్టుకొని కనిపిస్తున్నాడు. ప్రస్తతం భరత్ ఎలా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అన్న పూర్తి వివరాలు ఇండస్ర్టీ వర్గాల్లో అందుబాటులో లేదు.

 

View this post on Instagram

 

A post shared by Bharathkumar BKR (@iam_bkh)





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *