Bhuma Akhila Priya : మంచు విష్ణు, మ‌నోజ్ గొడ‌వ‌ల‌పై స్పందించిన భూమా అఖిల ప్రియ‌


Bhuma Akhila Priya : ఇటీవ‌ల మంచు ఫ్యామిలీలో మ‌నోజ్ పెళ్లి వేడుక జ‌ర‌గ‌డంతో అంతా సంతోషంగా క‌నిపించారు. వైభవంగా జరిగిన ఈ వివాహంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, విజయమ్మ, భూమా అఖిల ప్రియ దంపతులు, రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక మంచు ల‌క్ష్మీ ఈ పెళ్లి వేడుక‌ని అన్నీ తానై చేసింది. ఈ వేడుక‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్న స‌మ‌యంలోనే మంచు ఫ్యామిలీ లో జ‌రిగిన గొడవ రచ్చకెక్కింది. చిన్న గొడవే అయినా .. ఇప్పుడు అది చిలికి చిలికి గాలివానగా మారింది.

విష్ణు సారధి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు మంచు విష్ణు. తన బంధువులను కొడుతున్నడని ఓ వీడియోను షేర్ చేశారు మనోజ్. దాంతో వీరిద్దరి మధ్య గొడవ రోడ్డున పడింది. మంచు విష్ణు – మంచు మనోజ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా బోలెడన్ని వార్తలు షికారు చేస్తుండగా.. ఉన్నట్టుండి మనోజ్ పెట్టిన ఓ వీడియో సంచలనంగా మారింది. అన్న మంచు విష్ణు ఆగడాలు ఇవీ అంటూ ఏకంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి షాకిచ్చారు మంచు మనోజ్. మంచు వారింట జరుగుతున్న ఈ గొడవ బట్టబయలు కావడంతో జనాల్లో డిస్కషన్స్ షురూ అయ్యాయి.

Bhuma Akhila Priya responded on manchu vishnau and manoj comments
Bhuma Akhila Priya

మంచు విష్ణు, మనోజ్ నడుమ మధ్య ఏం జరిగింది? అసలు గొడవకు కారణం ఏమిటి? అనేది చర్చనీయాంశం కాగా, దీనిపై మంచు ల‌క్ష్మీ రీసెంట్‌గా స్పందిస్తూ.. ఇది చిన్న గొడ‌వే అని, కావాల‌నే దీనిని పెద్ద‌దిగా చేస్తున్నార‌ని వాపోయింది. అయితే ఈ వివాదంపై భూమా అఖిల ప్రియ‌కు కూడా ఓ ప్ర‌శ్న ఎదురైంది. తాజాగా మీడియాతో మాట్ల‌డిన ఆమె పార్టీ మార‌డం గురించి మాట్లాడుతూ.. తాను టీడీపీని వీడేది లేదు అని చెప్పుకొచ్చింది. ఇక మంచు ఫ్యామిలీ గొడ‌వ‌ల‌పై కూడా ప్ర‌శ్న ఎదురుకాగా, అది వారి కుటుంబం విష‌యం. వాళ్లనే అడిగితే బాగుంటుంది. దానికి నేనేం చెబుతాను అంటూ ఆ వివాదంపై స్పందించేందుకు నిరాక‌రించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *