Babar Azam : అందువ‌ల్లే ఓడిపోయాం.. భారత్‌తో ఓట‌మిపై పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజం..


Babar Azam : వెస్టిండీస్‌, యూఎస్ఏ వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 టోర్నీలో భార‌త్ పాకిస్థాన్‌పై అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించిన విష‌యం విదితమే. త‌క్కువ ప‌రుగులే చేసిన‌ప్ప‌టికీ భార‌త్ అద్భుత‌మైన బౌలింగ్‌తో పాక్‌ను క‌ట్ట‌డి చేసింది. దీంతో భార‌త్ పాకిస్థాన్‌పై 6 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది. అయితే మ్యాచ్ అనంత‌రం పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజం మాట్లాడుతూ మొద‌టి 10 ఓవ‌ర్ల వ‌ర‌కు త‌మ జ‌ట్టు భార‌త్‌పై ప‌ట్టు సాధించింద‌ని తెలిపాడు. కానీ త‌రువాతి ఓవ‌ర్ల‌లో డాట్ బాల్స్ ఎక్కువ‌గా ఆడామ‌ని, అలాగే వ‌రుస‌గా వికెట్ల‌ను కోల్పోయామ‌ని తెలిపాడు.

డాట్ బాల్స్‌ను ఎక్కువ‌గా ఆడ‌డం, వ‌రుస‌గా వికెట్ల‌ను కోల్పోవ‌డంతో చేయాల్సిన ప‌రుగులు పెరిగిపోయాయ‌ని, దీంతో ఒత్తిడి పెరిగి స‌రిగ్గా ఆడ‌లేక‌పోయామ‌ని తెలిపాడు. వికెట్ల‌ను కాపాడుకుని ఉంటే చివ‌ర్లో ప‌రుగులు వ‌చ్చేవ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. కాగా భార‌త్ త‌న ఇన్నింగ్స్‌లో కేవ‌లం 119 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయిన విష‌యం విదితమే. ఈ క్ర‌మంలో పాక్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌ను కోల్పోయి 113 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది.

Babar Azam told why they lost against india
Babar Azam

కాగా ఇప్ప‌టికే పాకిస్థాన్ అమెరికా చేతిలో ఓడిన విష‌యం విదితమే. దీంతో పాకిస్థాన్ సూప‌ర్ 8 చేరే అవ‌కాశాలు మ‌రింత సంక్లిష్టంగా మారాయి. ఒక వేళ త‌దుప‌రి మ్యాచ్‌ల‌లో కెన‌డా, ఐర్లాండ్‌ల‌ను భారీ తేడాలో ఓడించినా అమెరికా ఇంకో మ్యాచ్ గెలిస్తే వారే సూప‌ర్ 8కు చేరే చాన్సులు ఎక్కువ‌గా ఉంటాయి. అమెరికా త‌దుపరి మ్యాచ్‌ల‌లో భార‌త్‌, ఐర్లాండ్ చేతిలో ఓడాలి. అప్పుడు కూడా పాక్‌కు మెరుగైన ర‌న్ రేట్ ఉండాలి. ఇలా జరిగితేనే పాక్ సూప‌ర్ 8కు చేరే చాన్సులు ఉంటాయి. లేదంటే క‌ష్ట‌మే అని చెప్పాలి. ఇక భార‌త్ త‌న త‌రువాతి మ్యాచ్‌ను అమెరికాతో ఈనెల 12వ తేదీన ఆడుతుంది. భార‌త కాల‌మానం ప్రకారం ఆ రోజు రాత్రి 8 గంట‌ల‌కు న్యూయార్క్‌లో మ్యాచ్ ప్రారంభం అవుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *