Ambati Rambabu : చంద్ర‌బాబు మేనిఫెస్టో భ‌గ‌వ‌ద్గీత‌లా ఉందంటూ అంబ‌టి కామెంట్స్


Ambati Rambabu : వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఏ పార్టీ జెండా ఎగ‌ర‌వేస్తుంద‌నేది చెప్ప‌డం కొంత క‌ష్టంగానే ఉంది. టీడీపీ, జ‌న‌సేన పొత్తు పెట్టుకొని వైసీపీని ఓడించే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే టీడిపి జనసేన పొత్తులను వైసీపీ పదేపదే టార్గెట్ చేస్తుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి టిడిపి జనసేన పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను పదేపదే వైసిపి టార్గెట్ చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింఇ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పార్టీ పెట్టారని తీవ్ర స్థాయిలో వైసిపి నేతలు విరుచుకుపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పదేపదే విమర్శలవర్షం కురిపించే ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు తాజాగా చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు.

ద‌స్తాలు ద‌స్తాలు మేనిఫెస్టో ఇచ్చి ఒక్క‌టైన అమ‌లు చేశావా..14 ఏళ్ల ముందు చేయ‌నిదాని క‌న్నా ఎక్కువ‌గా ఇప్పుడు చేస్తావా అంటూ అంబ‌టి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అంద‌రి నెత్తిన ఆయ‌న టోపీ పెట్టారు. మీరే చూశారుగా అని అన్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కన్నా అద్భుతంగా నువ్వు ప‌రిపాల‌న చేస్తావా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చింది ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌లేద‌ని, ఇప్పుడు చంద్ర‌బాబుని ఎవ‌రు న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని తెలియ‌జేశాడు. ఇక పొత్తుల గురించి మాట్లాడుతూ.. ఒక ఒరలో రెండు కత్తులు ..కుదురుతుందా ? పాము-ముంగీసా స్నేహం ..కుదురుతుందా ? అంటూ ప్రశ్నించిన ఆయన, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండూ రెండు కత్తులు లాంటివని , అవి ఒకే ఒరలో ఉండడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

Ambati Rambabu comments on tdp manifesto
Ambati Rambabu

ఇదే సమయంలో పాముకు ముంగీసకు శత్రుత్వం ఉంటుందని, ఆ రెండింటికి స్నేహం కుదురుతుందా చెప్పాలని ప్రశ్నించారు. ఏ చిన్న సందర్భంగా దొరికినా మంత్రి అంబటి రాంబాబు అటు పవన్ కళ్యాణ్ ను, ఇటు చంద్రబాబును తూర్పారబడుతున్నారు. మ‌రి అంబ‌టి చేసిన వ్యాఖ్య‌ల‌కి అటు టీడీపీ ఇటు జ‌న‌సేనెలా స్పందిస్తాయి అన్న‌ది చూడాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *