హీరో ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా…


uday kiran wife vishita

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చిత్రం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరో హోదాను సొంతం చేసుకున్నాడు ఉదయ్ కిరణ్.చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తో నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయ్.ఆ తర్వాత నువ్వు నేను,మనసంతా నువ్వే బ్లాక్ బస్టర్ హిట్స్ తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు.వరుస హిట్స్ తో లవర్ బాయ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్.అదే సమయంలో మెగా స్టార్ చిరంజీవి కూతురు సుస్మిత తో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ జరగడం ఆ తర్వాత కాన్సల్ అవ్వడం వెంటనే జరిగిపోయాయి.

ఆ తర్వాత కెరీర్ మీద దృష్టి పెట్టిన ఉదయ్ కిరణ్ తెలుగులో కలుసుకోవాలని,శ్రీ రామ్,హోలీ,నీ స్నేహం,నీకు నేను నాకు నువ్వు,అవునన్నా కాదన్నా వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు.ఆ తర్వాత ఆయనకు వరుసగా ప్లాప్ లు దక్కాయి.ఇక ఉదయ్ కిరణ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినా విషిత ప్రేమించి 2012 లో వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత సినిమాలు ప్లాప్ అవ్వడం,ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు వంటి ఒత్తిడితో ఉదయ్ కిరణ్ 2014 లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.విషిత పెళ్లికి ముందు నుంచి సాఫ్ట్ వేర్ గా పని చేస్తున్నారు.

uday kiran wife vishita

ఉదయ్ తో పెళ్లి తర్వాత కూడా ఈమె జాబ్ ను కంటిన్యూ చేసారు.జాబ్ చేస్తూ ఉదయ్ కు మోరెల్ గాను సపోర్ట్ చేసారు విషిత.ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా గడుపుతున్నారు విషిత.ప్రేమించిన భర్త దూరం కావడంతో కుమిలిపోయిన విషిత ఈ జీవితాన్ని ఆయనకే అంకితం చేసారు.ప్రస్తుతం విషిత పేస్ బుక్ లాంటి పెద్ద కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.తనకు వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ అప్పుడప్పుడు ఉదయ్ పేరు మీద ఎన్జీవో లకు విరాళాలు ఇస్తూ ఉంటారు.అప్పట్లో ఉదయ్ కిరణ్ చనిపోయిన సమయంలో విషితకు మరొక వ్యక్తితో ఉన్న సంబంధం కారణంగానే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి.ఇక ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఉదయ్ కిరణ్ చివరి సారిగా రాసిన లేఖలో కూడా వీటి గురించి రాసి ఉంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *