షాకింగ్…. పాకిస్తాన్ ఆస్కార్ ఎంట్రీ మూవీ ‘జాయ్‌ల్యాండ్’ పై నిషేధం … కారణమిదే | Manacinema


Joyland movie banned | పాకిస్తానీ మూవీ ‘జాయ్‌ల్యాండ్‌’ అంతర్జాతీయం గా ఎన్నో విజయాలు సాధించింది. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు చెందిన ఎల్జీబీటీక్యూ ప్రైజ్ తోపాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది ఈ సినిమా. టొరంటో ఫిలిమ్ ఫెస్టివల్, అమెరికన్ ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి.

ఆస్కార్ అవార్డ్స్ 2023 కోసం పాకిస్తాన్ అధికారికంగా ‘జాయ్‌ల్యాండ్‌’ ను నామినేట్ చేసింది. కట్ చేస్తే …ఈ వారంలో విడుదల కావాల్సిన ‘జాయ్‌ల్యాండ్’ సినిమా పాకిస్తాన్‌లో నిషేదానికి గురైంది. వివరాల్లోకి వెళితే …

మధ్య తరగతి కుటుంబం చెందిన ఓ యువ వివాహితుడు ఓ ట్రాన్స్‌జెండర్ తో ప్రేమలో పడతాడు. వారిద్దరూ ఆ తరువాత ఎదుర్కున్న సవాళ్ళే ‘జాయ్‌ల్యాండ్‌’ సినిమా కథ. ఈ సినిమాకు పాకిస్తాన్ అధికారులు ముందు స్క్రీనింగ్ సర్టిఫికేట్ ఇచ్చి, తర్వాత ఉపసంహరించుకున్నారు.

ఇస్లాం మత ఛాందసవాదులు ఒత్తిడికి లొంగి ఇలా చేసినట్టు స్పష్టమవుతుంది. ఆస్కార్ కు ఎంపిక చేయటమంటే, ప్రపంచానికి ఆ సినిమా చూపించటమే. బ్యాన్ చేయటమంటే ప్రపంచం అంతా చూసినా పరవాలేదు, కానీ పాకిస్తాన్ లో చూడగూడదు అనేనా? ఆ లాజిక్కేంటో వారికైనా తెలుసో లేదో?

ఈ సినిమా హోమోసెక్సువాలిటీని ప్రమోట్ చేస్తున్నట్లు ఉందని కొన్ని రిలీజియస్ గ్రూప్స్ నుంచి వ్యతిరేకత రావటంతో ఈ బ్యాన్ విధించినట్లు తెలుస్తుంది.


Post Views today | 0Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *