వరుణ్,లావణ్య పెళ్లి శుభలేఖ చూసారా…రిసెప్షన్ హైదరాబాద్ లో ఎప్పుడంటే





Varun Tej Lavanya Tripathi Wedding Card
Varun Tej Lavanya Tripathi Wedding Card

Varun Tej – Lavanya Tripathi : ఇప్పటికే నిశ్చితార్ధం చేసుకున్న వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికి తెలిసిందే.వీరిద్దరి నిశ్చితార్ధం జూన్ 20 న కుటుంబసభ్యులు,సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది.అయితే ప్రస్తుతం వరుణ్,లావణ్య ల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి.వరుణ్ తేజ్,లావణ్య ల పెళ్లి శుభలేఖ కూడా వచ్చేసింది.ఈ శుభలేఖ లో వరుణ్ తేజ్ నాయనమ్మ,తాతయ్య ల పేరులతో పాటు వరుణ్ బాబాయిలు చిరంజీవి,పవన్ కళ్యాణ్ మరియు వరుణ్ అన్నయ్య రామ్ చరణ్ పేరును కూడా ముద్రించటం జరిగింది.

పెళ్లి వేడుక అక్టోబర్ 30 నుంచి మొదలు కానుందని సమాచారం.ఇక నవంబర్ 1 న ఇటలీ లోని టుస్కానీ నగరంలో వీరిద్దరి వివాహం కుటుంబసభ్యుల మధ్య జరగనుందని సమాచారం.ఆ తర్వాత వరుణ్,లావణ్య రిసెప్షన్ హైదరాబాద్ లో యెన్ కన్వెన్షన్ హాల్ లో నవంబర్ 5 న జరగనుంది.ఇక ఈ రిసెప్షన్ వేడుకకు సినీ సెలెబ్రెటీలు తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.

Varun Tej Lavanya Tripathi Wedding Card

నవంబర్ 1 న ఇటలీ జరగబోయే వివాహం కోసం మెగా ఫ్యామిలీ అక్టోబర్ 27 న బయలుదేరనున్నారని సమాచారం.రామ్ చరణ్,ఉపాసన ఈ పెళ్లి పనులను దగ్గరుండి చేసుకుంటున్నట్లు సమాచారం.తాజాగా రామ్ చరణ్,ఉపాసన ఈ పెళ్లి పనుల కోసం ఇటలీ కూడా వెళ్లినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో బిజీ గా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.దాంతో పవన్ కళ్యాణ్ ఈ పెళ్లి కోసం ఇటలీ వెళ్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.






Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *