మళ్లీ క‌న్నీళ్లు పెట్టిన స‌మంత‌.. ఈసారి ఏమైంది..?


టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఈ అమ్మ‌డు న‌టించిన చివ‌రి చిత్రం య‌శోద ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇక త్వ‌ర‌లో శాకుంత‌లం అనే మూవీతో అల‌రించ‌బోతుంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం ‘శాకుంతలం’ కాగా, గుణ శేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. కాగా ట్రైలర్‌ ఈవెంట్‌లో సమంత భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ మూవీ దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతుండగా సమంత చాలా ఎమోషనల్‌ అయింది.

ట్రైలర్‌ ఈవెంట్‌లో గుణ శేఖర్‌ ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ప్రశసించారు. సమంతను నమ్మి దిల్ రాజు ఈ ప్రాజెక్టులో భాగమై, కోట్ల రూపాయలు పెట్టారని అన్నారు. ఈ మాటలతో సమంత తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీరు పెట్టుకుంది., దానికి సామ్‌ ఎమోషనల్‌కు గురై కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం సమంత మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశాక నాపై మరింత అభిమానం పెరుగుతుంది. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని ఈవెంట్‌కు వచ్చానని’ తెలిపింది. గుణశేఖర్ గారికి సినిమానే జీవితమని అన్నారు. తన అంచనాలకు మించి ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని చెప్పారు. ఈ సినిమాకు తనను ఎంపిక చేసిన గుణశేఖర్ కు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు.

samantha again got emotional what happened this time

ఇక ఇటీవలే సామ్‌ మయోసైటిస్‌ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పడిప్పుడే సామ్‌ కోలుకుంటుంది. ఈ సినిమాతో స‌మంత త‌న ఖాతాలో మ‌రో మంచి హిట్ వేసుకోవాల‌ని అనుకుంటుంది. శాకుంత‌లం విష‌యానికి వ‌స్తే ఈ మూవీ మైథలాజికల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్క‌గా, ఈ సినిమాను గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్‌ ఈ సినిమా కోసం దాదాపు ఏడేళ్ళ సమయం తీసుకున్నాడు.

The post మళ్లీ క‌న్నీళ్లు పెట్టిన స‌మంత‌.. ఈసారి ఏమైంది..? first appeared on Telugu News 365.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *