బాలీవుడ్ హీరోల్లా కనిపిస్తున్న నటి సిమ్రాన్ కొడుకులు…సిమ్రాన్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్


Actress Simran Shares Her Family Photos Goes Viral In Social Media
Actress Simran Shares Her Family Photos Goes Viral In Social Media

Actress Simran: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ లలో సిమ్రాన్ కూడా ఒకరు అని చెప్పచ్చు.నటి సిమ్రాన్ 2000 లో తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోయారు.పంజాబీ కుటుంబంలో జన్మించిన సిమ్రాన్ ముంబై లో సెటిల్ అయ్యారు.సిమ్రాన్ నటి గానే కాకుండా మంచి డాన్సర్ గా,నిర్మాతగా,గాయనిగా కూడా గుర్తింపును తెచ్చుకున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్ శరత్ అబ్బాయిగారి పెళ్లి అనే సినిమాతో సిమ్రాన్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం చేసారు.అలా 1999 లో సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ 2004 వరకు స్టార్ హీరోయిన్ గా పలు సూపర్ హిట్ సినిమాలలో నటించారు.తెలుగులో సిమ్రాన్ రాకుమారుడు,యువరాజు,ప్రేమతో రా,నువ్వొస్తావనీ,డాడీ,కలిసుందాం రా,సమరసింహా రెడ్డి ఇలా పలు హిట్ సినిమాలలో నటించడం జరిగింది.

Actress Simran SActress Simran Family Photos
Actress Simran Family Photos

అభిమానులు సిమ్రాన్ ను అప్పటిలో లేడీ సూపర్ స్టార్ అని కూడా పిలుచుకునే వారు.అయితే పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సిమ్రాన్ మల్లి ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది.సీమరాజ,పెట్ట,రాకెట్రి వంటి సినిమాలలో సిమ్రాన్ నటించడం జరిగింది.అప్పట్లో సిమ్రాన్ వరుస సినిమా అవకాశాలతో బిజీ గా ఉన్న సమయంలోనే బిజినెస్ మ్యాన్ దీపక్ భాగను పెళ్లి చేసుకుంది.

Actress Simran Family Photos
Actress Simran Family Photos

ఈ దంపతులకు ఆదీఫ్,ఆదిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.ఇది ఇలా ఉంటె నటి సిమ్రాన్ సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండరు.మరో పక్క ఏ సినిమా ఈవెంట్ లలో కూడా ఈమె కనిపించరు అని చెప్పచ్చు.అయితే తాజాగా మాత్రం సిమ్రాన్ క్రిస్టమస్ పండుగా సందర్భంగా తన భర్త,ఇద్దరు కుమారులతో ఉన్న ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసారు.

Actress Simran Family Photos
Actress Simran Family Photos

ఈ ఫోటోను చుసిన నెటిజన్లు సిమ్రాన్ కొడుకులు ఇద్దరు బాలీవుడ్ హీరోల్లాగా ఉన్నారని..ఇప్పటికే సినిమాలలో నటించినట్లు ఉన్నారంటూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.ఎప్పుడు సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉండే సిమ్రాన్ తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేయడంతో ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ అవుతుంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *