ఫొటోలో క్యూట్ గా ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా…ప్రస్తుతం సౌత్ లో బాగా క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్…


1998 లో రిలీజ్ అయినా హనుమాన్ అనే చిత్రంతో టబు పాత్రకు చెల్లెలిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నారి ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఫొటోలో క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ఎవరో కాదు న్యాచురల్ స్టార్ నాని కు జోడిగా అలా మొదలైంది చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయినా అందాల ముద్దుగుమ్మ నిత్యా మీనన్.ఈమె 2006 లో కన్నడ సినిమా అయినా సెవెన్ ఓ క్లాక్ అనే చిత్రంలో సహాయక పాత్రలో నటించడం జరిగింది.

అలాగే మలయాళంలో ఆకాశ గోపురం,తమిళ్ లో నూట్రాను బదు,హిందీ లో మిషన్ మంగళ్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.నిత్యామీనన్ 1988 లో కర్ణాటక లోని బెంగళూరు లో జన్మించింది.ఆ తర్వాత ఈమె బెంగళూరు లోని పూర్ణ ప్రజ్ఞ స్కూల్ మరియు మౌంట్ కార్మెల్ కాలేజీలో చదువుకుంది.

సంతోష్ రాయి పతాజీ దర్శకత్వం వహించిన 7 ఓ క్లాక్ అనే చిత్రం తో సహాయక పాత్రలో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది నిత్యా మీనన్.కె ఫై కుమారన్ దర్శకత్వం వహించిన మలయాళం చిత్రం ఆకాశ గోపురంలో ప్రముఖ పాత్రలో మోహన్ లాల్ తో కలిసి నటించింది.ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.ఆ తర్వాత నిత్యా తెలుగులో హీరో నాని కు జోడిగా అలా మొదలైంది సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.మొదటి సినిమాతోనే తన అందంతో,అభినయంతో ఆకట్టుకొని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *