Salaar OTT: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త అని చెప్పచ్చు.ఇటీవలే ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సలార్ సినిమా అప్పుడే ప్రముఖ ఓటిటీ లోకి వచ్చేస్తుంది.జనవరి 20 శుక్రవారం రోజు అర్ధరాత్రి నుంచి ప్రభాస్ సలార్ మూవీ ప్రముఖ ఓటిటీ నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది.సలార్ మూవీ థియేటర్ లలో రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఓటిటీ ప్లాట్ ఫారం అందుబాటులోకి రావడం గమనార్హం.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్,హిందీ,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా హీరోయిన్ శృతి హాసన్ నటించారు.మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వి రాజ్ సుకుమారం కీలకమైన పాత్రలో నటించారు.
Also read : ఇప్పటి వరకు ఎవరు చూడని హాస్యనటుడు బ్రహ్మనందం ఫ్యామిలీ ఫోటోలు వైరల్
భారీ అంచనాలతో డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ కు సలార్ సినిమా తో మంచి సాలిడ్ హిట్ లభించింది.
థియేటర్ లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సలార్ సినిమా ఓటిటీ లో ఎప్పుడు ప్రసారం అవుతుంది అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిజం గా ఇది శుభవార్త అని చెప్పచ్చు.థియేటర్ లలో రిలీజ్ అయిన అతి కొంత సమయంలోనే బ్లాక్ బస్టర్ సినిమా సలార్ ఓటిటీ లో రావడం విశేషం.ఈ సినిమా ఓటిటీ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్ సొంతం చేసుకుంది.ఈ సినిమా హక్కుల కోసం నెట్ ఫ్లిక్ సలార్ నిర్మాతలకు భారీగానే చెల్లించింది అని తెలుస్తుంది.
Also read : గుర్తుపట్టలేనంత అందంగా మారిపోయిన 7 / G బృందావన కాలనీ హీరోయిన్…లేటెస్ట్ ఫోటోలు వైరల్
Source link