ప్రభాస్ తో నటించిన ఈ హీరోయిన్ ను గుర్తుపట్టగలరా…ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా..!


Eeswar Heroine: రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమా ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.జయంత్ సి పనర్జి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు జోడిగా శ్రీదేవి విజయ్ కుమార్ నటించింది.హీరోయిన్ శ్రీదేవి నటించిన మొదటి సినిమా ఈశ్వర్ అయినప్పటికీ బాలనటిగా శ్రీదేవి పలు సినిమాలలో నటించింది.రుక్మిణి అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ కు చెల్లెలి పాత్రలో కనిపించింది శ్రీదేవి.చిన్నప్పుడూ కొంచెం బొద్దుగా ఉండే శ్రీదేవి ఆ తర్వాత సన్నగా ఎంతో అందంగా కనిపించింది ఈశ్వర్ సినిమాలో.

మొదటి సినిమాతోనే శ్రీదేవి తన అందంతో,నటనతో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.1992 రిక్షా మామ అనే తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది శ్రీదేవి.2002 లో ప్రభాస్ కు జోడిగా ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈశ్వర్ సినిమాలో తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది.ఈశ్వర్ సినిమా విజయం తర్వాత తమిళ్ లోను,తెలుగులోనూ శ్రీదేవి కి అవకాశాలు క్యూ కట్టాయి.

Eeswar Heroine
sridevi vijaykumar

అయితే తమిళ్ లో కంటే తెలుగులోనే శ్రీదేవి కి మంచి క్రేజ్ వచ్చింది.తెలుగులో ఈమె నిన్నే ఇష్టపడ్డాను,నిరీక్షణ,ఆదిలక్ష్మి,పెళ్లి కానీ ప్రసాద్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే రాహుల్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది శ్రీదేవి.ఈ దంపతులకు రూపిక అనే పాప ఉండి.శ్రీదేవి చివరిసారిగా 2011 లో మాస్ మహారాజ్ రవితేజ కు జోడిగా వీర సినిమాలో కనిపించింది.పలు సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటిస్తుంది శ్రీదేవి.అలాగే డాన్స్ మరియు ఇతర రియాలిటీ షో లకు జడ్జి గా కూడా వ్యవహరిస్తోంది.ప్రస్తుతం శ్రీదేవి కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

Also read : బికినీ ఫోటోను షేర్ చేసిన సమంత…కేవలం కొన్ని గంటల్లోనే ఎన్ని మిలియన్స్ వ్యూస్ తెలుసా…ఫోటోలు వైరల్

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *