Ponniyin Selvan 2: గత కొన్ని సంవత్సరాల నుంచి పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.తమిళ్ నుంచి వచ్చి భారీ బడ్జెట్ సినిమా పొన్నియిన్ సెల్వన్.మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ లో ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ అయ్యి తమిళ్ లో హిట్ సాధించింది.అయితే ఈ సినిమా తమిళ్ తప్ప మిగిలిన అన్ని భాషలలో ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది అని చెప్పచ్చు.తాజాగా రిలీజ్ అయినా ఈ సినిమా రెండవ భాగం కూడా ఇతర భాషలలో అంతంతమాత్రం అనే చెప్పాలి.
అయితే ఈ సినిమాలో నటించిన ఒక అమ్మాయి గురించి మాత్రం ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు అని చెప్పచ్చు.హీరో హీరోయిన్ల గురించి వాళ్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే కొన్ని సందర్భాలలో సినిమాలో నటించి మెప్పించిన ఇతర యాక్టర్లు పాపులర్ అవుతుంటారు.అలా పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించిన ఇద్దరు టీనేజీ అమ్మాయిలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు అని చెప్పచ్చు.
హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించిన సారా అర్జున్ గురించి చాల మందికి తెలిసే ఉంటుంది.చిన్నపాటి త్రిష ల యువరాణిలా నీలా అనే అమ్మాయి చాల బాగా చేసింది అని చెప్పడంలో సందేహం లేదు.నీల తమిళ సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కవిత భారతి నటి కన్య భారతి దంపతుల కూతురు.కేరళ లో చదువుకుంటున్న ఈ అమ్మాయి ఈ సినిమా ఆడిషన్స్ లో పాల్గొనగా యంగ్ త్రిష గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది ఈ అమ్మాయి.
Source link