పెళ్లి రోజును వృద్ధాశ్రమంలో జరుపుకున్న సుమ కనకాల…ఫోటోలు వైరల్

Anchor Suma
Anchor Suma

Anchor Suma: బుల్లితెర పై దశాబ్దాల నుంచి సుమ కనకాల ఏలుతున్నారు.ఇప్పటి వరకు బుల్లితెర మీద ఆమెకు పోటీ ఇచ్చే యాంకర్ ఎవరు లేరని చెప్పడం లో సందేహం లేదు.యాంకరింగ్ లో తనకంటూ ఒక బెంచ్ మార్క్ ను వేసి ఒక స్టార్ హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని క్రేజ్ ను ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు సుమ కనకాల.తాజాగా సుమ కనకాల తన పెళ్లి రోజు నాడు చేసిన ఒక పనితో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

Anchor Suma Rajeev Kanakala
Anchor Suma Rajeev Kanakala

రాజీవ్ కనకాల,సుమ కనకాల తమ పెళ్లి రోజు వేడుకను హైదరాబాద్ లోని ఒక వృద్ధాశ్రమం లో జరుపుకున్నారు.వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆహరం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వృద్ధులతో ముచ్చటించారు రాజీవ్ కనకాల(Rajeev Kanakala),సుమ కనకాల(Suma Kanakala).రాజీవ్,సుమ లతో పాటు వారి పిల్లలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.ఇక రాజీవ్ దంపతులు వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

Also Read : స్టార్ హీరోయిన్స్ మధ్యలో ఉన్న ఈ వ్యక్తిని గుర్తుపట్టగలరా….ఈ మధ్య బాగా పాపులర్ అయినా వ్యక్తి..!

Anchor Suma Rajeev Kanakala
Anchor Suma Rajeev Kanakala

ఈ ఫోటోలను చుసిన సుమ అభిమానులు మరియు నెటిజన్లు సుమ చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక సుమా ది చాల మంచి హృదయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.ఇక సుమ మరియు రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.సుమ మలయాళీ అమ్మాయి అయినా కూడా వాళ్ళ నాన్న ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.నటి కావాలనుకున్న సుమ ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సుమ కు రాజీవ్ కనకాల తో పరిచయం ఏర్పడడం.ఇక ఆ పరిచయం కాస్త ప్రేమ గా వారిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *