పెళ్లయిన కొద్ది రోజులకే భర్తలను కోల్పోయిన టాలీవుడ్ స్టార్లు వీళ్లే !


చిత్ర పరిశ్రమ ఎన్నో సవాళ్లను కూడుకున్న రంగం. ఈ రంగంలో చాలా మంది కష్టపడి పైకి వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. సినిమాల్లో ముఖానికి మేకప్ వేసుకుని నవ్వుతూ ఉండే వారందరూ వ్యక్తిగత జీవితాల్లో ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ అదంతా మనకు తెలియదు. అయితే ఎవరైనా సరే పెళ్లి అయిన అనంతరం అత్తగారింట్లో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అనుకుంటారు. అయితే కొంద‌రు నటీమణులకు కాలం కలిసి రాక పెళ్లయిన కొద్ది రోజులకే భర్తకు దూరం అవడం వారు ఆకస్మాత్తుగా మరణించడంతో తమ జీవితాల‌లో చీకటి ముసుగులు అలుముకుంటున్నాయి. ఇక అలా ఎవరు ఉన్నారు.. ఒకసారి తెలుసుకుందాం.

భానుప్రియ ఆదర్శ కౌశల్ ని వివాహం చేసుకొని అమెరికాకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇకపోతే అక్కడ పాప జన్మించిన తర్వాత భర్తతో తగాదాలు ఏర్పడడంతో ఆమె ఇండియా వచ్చింది. అయితే అక్కడ ఆదర్శ కౌశల్ మరణించడంతో భానుప్రియ అక్కడకు వెళ్లి దగ్గరుండి అతని అంత్యక్రియలు పూర్తి చేసింది. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘన రాజ్.. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడ ముచ్చటైన జంట వీరిది. ఇకపోతే చిరంజీవి రెండేళ్ళకే గుండెపోటుతో కన్నుమూయడం జరిగింది. ఇక ఆయన చనిపోయినప్పుడు ఆమె భార్య 5వ నెల గర్భవతి గా ఉంది. ప్రస్తుతం కొడుకుతో, కుటుంబంతో కలిసి ఉంటుంది.

these actress lost their husbands at early stages

సురేఖ వాణి చాలా చిన్న వయసులోనే ఆమె భర్తను కోల్పోయింది. కాగా ఈయన పలు టీవీ సీరియల్స్ కు డైరెక్టర్ గా పని చేసేవారు. అయితే అంతే కాదు వీరిద్దరిది ప్రేమ వివాహం. కాగా ఆయన మరణించడంతో తన కూతురు సుప్రీతతో కలిసి జీవిస్తోంది.

రేఖ హాట్ లైన్ కిచెన్ వేర్ సంస్థ యజమాని ముఖేష్ అగర్వాల్ ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ముఖేష్ కి గతంలోనే పెళ్లి జరిగిందని, పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. దాని తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. కాగా దాని అనంతరం విడిపోయారు. అయితే రేఖతో విడాకులు జరగడం, తర్వాత వ్యాపారంలో నష్టాలతో ఆత్మహత్య చేసుకున్నాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *