పవర్ ఫుల్ లుక్ తో NTR ౩౦ టైటిల్ అండ్ రిలీజ్ డేట్


Devara titled for NTR30 | ఆర్ ఆర్ ఆర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఇంకా మొదలు కాలేదు. ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కొరటాల గత చిత్రం ‘ఆచార్య’ భారీ డిజాస్టర్ కావటంతో ఆ సెటిల్మెంట్ల రచ్చ ఇంకా తేలలేదని, తద్వారా ఎన్టీఆర్ సినిమా లేట్ అవుతుందని చాలాకాలం నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

ఇందులో ఎంతోకొంత నిజం లేకపోలేదు. అయితే అదొక్కటే సినిమా ఆలస్యానికి కారణం కాదు. ఆమధ్య పూజా కార్యక్రమం ప్లాన్ చేసుకుని, అలియా భట్ రావట్లేదని పోస్ట్ ఫోన్ చేసారు. కట్ చేస్తే ….పెళ్లి వంకతో ఆలియా తప్పుకుంది. దీంతో హీరోయిన్ సమస్య తలెత్తింది. అప్పట్లోనే కొరటాల జాన్వీ కపూర్ ను ఫైనల్ చేసాడని వార్తలొచ్చాయి. ఈమధ్యే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక అసలు విషయానికి వస్తే….

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ 30 నుంచి ఫస్ట్ లుక్ ని తాజాగా లాంచ్ చేశారు. ఇందులో బ్లాక్ డ్రెస్ లో తీరంలో తడిసిన రక్తంతో ఉన్న కత్తి పట్టుకొని సీరియస్ లుక్స్ లో తారక్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్ నుంచి మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల నుంచి ఈ పోస్టర్ కి మంచి స్పందన వస్తోంది. ఈ పోస్టర్ తో మూవీ పైన కొరటాల శివ అమాంతం హైప్ క్రియేట్ చేసేశారు.

348261698 1233553433942662 960076381032124989 n
348261698 1233553433942662 960076381032124989 nSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *