Anikha Surendran | మలయాళీ పాప అనిఖా సురేంద్రన్ మలయాళ సినిమాల్లో చైల్డ్ ఐరిష్ గా ఎంట్రీ ఇచ్చింది. బేబీ అనిఖా గా పాపులర్ అయినా ఈ అమ్మడు తమిళ్ లోనూ ఓ నాలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. నాను రౌడీదాన్ సినిమాలో నయనతార చిన్నప్పటి పాత్రలో, మెరుదన్ సినిమాలో జయం రవి చెల్లెలి పాత్రలో, మిగతా రెండు సినిమాల్లో అజిత్ కూతురిగా నటించింది. క్వీన్ వెబ్ సిరీస్ లో చిన్నప్పటి జయలలితగా నటించి ప్రశంసలు పొందింది అనిఖా సురేంద్రన్.
మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘కప్పెలా’ చిత్రాన్ని సితార ఎంటర్‍టైన్‍మెంట్స్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమలో ఒక హీరోయిన్ గా అనిఖా సురేంద్రన్ డెబ్యూ చేయనుంది. ఈమధ్యే ఘోస్ట్ లో నాగార్జున మేనకోడలుగా చేసి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా, హీరోయిన్ గామాత్రం ‘బుట్టబొమ్మ’ అమ్మడి డెబ్యూ సినిమా. ప్రస్తుతం నెట్లో వేడి పుట్టిస్తుంది. అమ్మడి తాజా ఫోటోలు మీరూ చుడండి.
Source link