డైరెక్టర్ పాత ట్వీట్లకు మరో సినిమా బలి? | Manacinema


Pradeep Ranganathan Love today | ఈమధ్య కొంతమంది హీరోలు రీమేక్ లతో సేఫ్ గేమ్ ఆడుతుంటే, నిర్మాతలు డబ్బింగ్ వెర్షన్ లతో కాసులు దండుకుంటున్నారు. నిన్న కాక మొన్న కన్నడ సినిమా ‘కాంతారా’ హిట్టయిందో లేదో, వారంలోనే అల్లు అరవింద్ ‘గీత ఆర్ట్స్’ తెలుగు వెర్షన్ రిలీజ్ చేసింది.

తాజాగా ఈనెల 4 న రిలీజ్ అయి హిట్ టాక్ దాచుకున్న ఓ తమిళ సినిమా ను దిల్ రాజు తెలుగులో రెండు వారాల గ్యాప్ తో విడుదల చేయనున్నాడు. వివరాల్లోకి వెళితే ….ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’ ఈనెల 4 న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

లీడ్ యాక్టర్లు పెద్దగా క్రేజ్ ఉన్నవాళ్లు కాకపోయినా, రాధికా, సత్యరాజ్ లాంటి సీనియర్ నటీనటుల పాడింగ్ తో సినిమాకు క్రేజ్ వచ్చింది. ఇదొక సాదాసీదా ప్రేమకథ.ప్రేమించుకున్న హీరో హీరోయిన్లను, మొబైల్స్ ఎక్స్‌చేంజ్‌ చేసుకోని ఒకరోజు ఆగి అప్పుడు కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే తనకూ ఓకే అని చెబుతాడు.

ఒకరి సీక్రెట్లు మరొకరు తెలుసుకోక హీరో హీరోయిన్ల పెళ్లి జరిగిందా, పెటాకులైందా అనేది సినిమా కథ. సీరియస్ పాయింట్ తో హాస్యం మిక్స్ అయిన ఈ సినిమా తమిళనాట విజయం సాధించినా, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే గారంటీ లేదు. మరోపక్క కొత్త వివాదం ఒకటి ఈ సినిమాను చుట్టుముట్టింది.

ఈ మధ్య నితిన్ ‘మాచెర్ల నియోజకవర్గం’ సినిమా భారీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇందులో ఆ డెరెక్టర్ పాత ట్వీట్ల పాత్ర చాల ఎక్కువ. ఇప్పుడు ఇలాంటి వివాదమే ‘లవ్ టుడే’ సినిమానూ చుట్టేస్తోంది. వివరాల్లోకి వెళితే …

దర్శకుడు కావడానికి ముందు ఫేస్ బుక్, ట్విట్టర్లో ప్రదీప్ రంగనాథన్ పెట్టిన పోస్టులను తవ్వి తీసి, వాటి స్క్రీన్ షాట్లతో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ధోని, సచిన్ టెండూల్కర్ లను తిడుతూ అయ్యగారు పెట్టిన పోస్టులు వివాదాలకు కారణమయ్యాయి. దీనిపై స్పందించిన ప్రదీప్ రంగనాథన్ కొన్ని పోస్టులు నిజమైనవే అని, సరైన మెచ్యూరీటి లేనపుడు పెట్టానని, వయసుతో పాటు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నానని అతను క్లారిటీ ఇచ్చాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *