కొత్త ట్రైలర్ తో బూతు సినిమా దుమ్ము దులిపిన వర్మ … ఈసారైనా రిలీజ్ అవుతుందా? | Manacinema


Ram gopal varma Dangerous release date | ఒకప్పుడు మంచి టాలెంటెడ్ దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో కేవలం బూతు సినిమా దర్శకుడిగా మారిపోయాడు. ఆర్జీవీ నుంచి వస్తున్న బూతు వరుసలో తాజా చిత్రం ‘మా ఇష్టం – డేంజరస్’. లెస్బియన్ లవ్, క్రైమ్ అండ్ యాక్షన్ మూవీ అంటూ ప్రమోషన్ ఊదర గొట్టడమే కాక చిత్ర విచిత్రమైన ప్రచార టెక్నీక్కులు వాడుతున్నాడు వర్మ.

ఏప్రిల్ 8 న ఈ సినిమా విడుదల చేయనున్నట్టు మొదట ప్రకటించారు. ఈ సినిమాలో ఓ హీరోయిన్ అయిన నైనా గంగూలీ సోషల్ మీడియాలో ఓ నీలి చిత్రాన్ని పోలిన వీడియో వదిలారు ప్రమోషన్ కోసం. మరో రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుందనగా ఈ వీడియో వదలటం వర్మ జిమ్మిక్కులో భాగమే. అయితే అనూహ్యంగా నట్టి కుమార్ కోర్టును ఆశ్రయించి ఈ సినిమా విడుదలను అడ్డుకున్నాడు.

కింది కోర్ట్ ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో సినిమా విడుదల అడ్డంకులు తొలగిపోయాయి. మే 6 న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన వర్మ ఎందుకో మళ్ళీ వాయిదా వేసుకున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన వర్మ సినిమాకు థియేటర్స్ దొరకలేదని అప్పట్లో వినిపించింది. మళ్ళీ ఎప్పటిలాగే జనం ఈ సినిమా గురించి మర్చిపోయారు.

ఇప్పుడు మరోసారి వర్మ ఆ సినిమా దుమ్ము దులిపాడు. కొత్త ట్రైలర్ తోపాటు డిసెంబర్ 9 న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ సారైనా విడుదల అవుతుందా? లేకపోతే మళ్లీ వాయిదా పడుతుందా అన్నది చూడాలి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *