కాలజ్ఞానంలో బ్రహ్మం గారు నందమయ గురుడ నందమయ చింతచెట్టుకు కల్లు పారేనాయా అంటూ చెప్పింది నిజమవుతుందా అంటే అవుననే అంటున్నారు జనగామ జిల్లా పాలకుర్తి లో నివసించే ప్రజలు.అక్కడ గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న అంగడి బజారులో యెల్లబోయిన సొమ్మలు ఇంటి ఆవరణలో ఉన్న చింత చెట్టుకు కల్లు ఏరులై పారుతుంది.అక్కడ నివసించే గ్రామా ప్రజలు తండోపతండాలుగా వచ్చి విచిత్రంగా చూస్తున్నారు.
సాధారణంగా అయితే తాటి,ఈత,ఖర్జురా చెట్లకు,కొబ్బరి,జిలుగా,వేప చెట్లకు కూడా కల్లు తీయడం మీరు వినే ఉంటారు.ఇలా ఈ చెట్ల నుంచి తీసిన కల్లు ను చాల మంది ఇష్టపడతారు.వేప చెట్టు నుంచి తీసిన కల్లును ఆయుర్వేధంగా కూడా ఉపయోగిస్తారు.
ఇప్పుడు వీటన్నిటికీ భిన్నంగా చింత చెట్టు నుంచి కూడా కల్లు ఏరులై పారుతుంది.పాలకుర్తి లో చింత చెట్టు నుంచి కల్లు పారడం వింతగా మారిందని చెప్పచ్చు.ఉన్నట్టుండి చింత చెట్టు నుంచి కల్లు పారడం చెట్టు కూడా కలర్ మారడం అక్కడున్న జనానికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఆ వింత దృశ్యాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు ఎగబడ్డారు.అక్కడున్న గ్రామస్తులు కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లే జరుగుతుందని చర్చించుకుంటున్నారు.
Source link