కమెడియన్ సుధాకర్ కుమారుడి పెళ్లి…వైరల్ అవుతున్న ఫోటోలు


Comedian Sudhakar Son Marriage: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత కమెడియన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపుగా మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో రాణించాడు సుధాకర్.బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 17 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.నటనకు తానూ దారమైనప్పటికీ తన కుమారుడు బెనెడిక్ మైఖేల్ ను టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నాడు సుధాకర్.తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీదుగా ఎంట్రీ ఉంటుందని గతంతో చెప్పుకొచ్చాడు సుధాకర్.అయితే తాజాగా సుధాకర్ కుమారుడు బెనెడిక్ మైఖేల్ (బెన్నీ) పెళ్లి చేసుకున్నాడు.ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి జగపతి బాబు,బ్రహ్మనందం,రోజా రమణి,చంద్ర బోస్ దంపతులు పలువురు హాజరయ్యారు.

ఇక బ్రహ్మనందం అయితే బన్నీ ని పెళ్లి కొడుకును చేసినప్పటి నుంచి రిసెప్షన్ వరకు సందడి చేసారు.సరదాగా అక్కడ ఉన్న వారి నవ్విస్తూ సొంత ఇంటి మనిషిలా బ్రహ్మనందం పెళ్లి మొదలైనప్పటి నుంచి అక్కడే ఉండటంతో సుధాకర్ కుటుంబ సభ్యులు ఆనంద పడుతున్నారు.రిసెప్షన్ లో మైక్ పట్టుకొని మాట్లాడిన బ్రహ్మనందం వీరిద్దరిని చూస్తుంటే పోలీస్ కేసు పెట్టాలనిపిస్తుంది…వీరిది బాల్య వివాహంలా అనిపిస్తుంది…ఈ రోజుల్లో ముదిరిపోయినా జంటల పెళ్లిళ్లు చూసాక..ఈ జంటను చూస్తుంటే చిన్నపిల్లలా క్యూట్ గా కనిపిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.

Comedian Sudhakar Son Marriage
Comedian Sudhakar Son Marriage

సుధాకర్ కుమారుడు బన్నీ పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగినట్లు తెలుస్తుంది.ఇక సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు,వీడియొ లు వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో సుధాకర్ ను చూస్తుంటే అతని ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వానంగా మారినట్లు తెలుస్తుంది.బక్కచిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్న సుధాకర్ ను ఇద్దరు పట్టుకొని స్టేజ్ మీదకు తీసుకోని వచ్చారు.వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో సుధాకర్ ను చుసిన ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇప్పుడు ఇలా అయిపోయాడేంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also read : అప్పట్లో మహేష్ బాబుకు మరదలిగా…ఇప్పుడు మహేష్ బాబుకు అత్తగా నటించిన నటి ఎవరో తెలుసా…!

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *