ఉదయాన్నే క్యూ లైన్ లో నుంచొని ఓటు వేసిన సినీ సెలెబ్రెటీలు…వైరల్ అవుతున్న ఫోటోలు

Telangana Elections 2023
Telangana Elections 2023

Telangana Elections 2023 : ఈ రోజు తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.సామాన్య ప్రజలతో పాటు సినిమా సెలెబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని తెలుస్తుంది.సినీ ప్రముఖులు ఎవరెవరు తమ ఓటు హక్కును  వినియోగించుకున్నారంటే…తెలంగాణాలో ఎన్నికల కోలాహలం నెలకొంది.సామాన్యుల నుంచి సినిమా సెలెబ్రెటీలు,రాజకీయ నాయకులూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని చెప్పచ్చు.ప్రముఖ దర్శకుడు సుకుమార్ అతని భార్య తబిత,ప్రముఖ టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రముఖ నటుడు,నిర్మాత,రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ మరియు అతని కుమారులు మరియు కూతురు కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.చిరంజీవి,అల్లు అర్జున్,సాయి ధరమ్ తేజ్ ఉదయాన్నే క్యూ లైన్ లో నుంచొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మి ప్రణతి మరియు తన తల్లి షాలిని తో కలిసి క్యూ లైన్ లో నుంచొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *