ఈగ సినిమాలో ఈ చిన్న మిస్టేక్ ను కూడా భ‌లే ప‌సిగ‌ట్టారే..!


తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో రాజ‌మౌళి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ డైరెక్ట‌ర్‌గా మారాడు. అయితే రాజమౌళి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఈగ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే.తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా 2012 సంవత్సరంలో విడుదలై కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. అయితే రాజమౌళి ఈ సినిమా కోసం పడిన కష్టంతో పోల్చి చూస్తే ఆ రేంజ్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోలేదు.అప్పట్లో రాజమౌళి హిందీలో ఈ సినిమాను విడుదల చేయగా అక్కడ ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు అనే చెప్పాలి.

రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా ఉన్నాడు..రాజమౌళి ప్రమోషన్స్ చేసిన ఇతర హీరోల సినిమాలు సైతం సక్సెస్ సాధిస్తున్నాయంటే ఆయన ఏ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నారో మ‌న‌కు అర్థమవుతుంది. అయితే రాజ‌మౌళి ఎప్పుడు కొత్త క‌థ‌ల‌ని ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం చేస్తూ ఉంటారు. ఆ క్ర‌మంలోనే ఈగ అనే సినిమాని తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌కి కొత్త అనుభూతిని అందించారు. ఈ చిత్రంలో నాని హీరోగా న‌టించగా స‌మంత హీరోయిన్ గా న‌టించింది. అంతే కాకుండా ఈ సినిమాలో నాని చనిపోయి ఆ త‌ర‌వాత ఈగ గా మ‌రో జ‌న్మ‌లో వ‌చ్చి విల‌న్ ను హ‌త‌మార్చ‌డం అనేది అప్ప‌ట్లో అంద‌రికి కొత్తగా అనిపించింది.

have you identified this mistake in eega movie

ఈగ సినిమా కోసం వీఎఎఫ్ ఎక్స్ వ‌ర్క్‌, జ‌క్క‌న్న విజ‌న్, నాని, స‌మంత ల అద్భుత‌మైన న‌ట‌నపై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. అయితే సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో మెప్పించిన కూడా ఈ సినిమాలో జ‌క్క‌న్న ఓ మిస్టేక్ చేసి నెటిజ‌న్ల‌కు దొరికిపోయాడు. దాంతో ఆ మిస్టేక్ ను గ‌మ‌నించిన నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో కొంచెం కొంచెం సాంగ్ అనేది ప్రేక్ష‌కుల‌కు తెగ‌న‌చ్చేసింది. ఈ సాంగ్ కంటే ముందు స‌మంత ఆఫీస్ నుండి బ‌య‌ట‌కు రాగా బైక్ లో పెట్రోల్ అయిపోతుంది. దాంతో బైక్ అక్క‌డే పార్క్ చేసి నానితో క‌లిసి ఇంటికి వెళుతుంది స‌మంత‌. రాత్రి స‌మంత బైక్‌లో పెట్రోల ఉండ‌దు, మ‌రుస‌టిరోజు ఉద‌యం స‌మంత బైక్ ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది. ఆ బైక్ వేసుకుని స‌మంత ఆఫీస్ కు వెళుతుంది. అస‌లు బైక్ ఎలా వ‌చ్చింది జ‌క్క‌న్నా అంటూ నెటిజ‌న్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *