సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగినా వాళ్ళు చాల మంది ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.కొంత మంది స్టార్ హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళను పెళ్లి చేసుకుంటే మరికొంత మంది మాత్రం వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు.అలా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరంటే…
శ్రీయ శరన్:ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయినా హీరోయిన్ శ్రియ.మొదటి సినిమాతోనే తన అందంతో అందరిని ఆకట్టుకుంది ఈ అమ్మడు.ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.శ్రియ 2018 లో ఆండ్రీ కొస్బివ్ ను వివాహం చేసుకుంది.ఒకప్పుడు షట్లర్ గా ఉన్న ఆండ్రీ ప్రస్తుతం వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రియమణి:తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రియమణి పెళ్లి అయి విడాకులు తీసుకున్న ముస్తఫా అనే వ్యాపారవేత్తను 2017 లో పెళ్లి చేసుకుంది.
పూర్ణ:ఈమె ప్రముఖ వ్యాపారవేత్త అయినా సానిద్ ఆసిఫ్ ను పెళ్లి చేసుకుంది.పెళ్లి అయినా తర్వాత కూడా ఈమె సినిమాలలో నటిస్తుంది.
కాజల్ అగర్వాల్:అందాల చందమామ కాజల్ గురించి తెలియని వాళ్ళు ఉండరు.ఈమె గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.
ప్రీతిజింతా:ఈమె కూడా వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.ఈమె భర్త జేనే గుడెన్ వ్యాపారరంగంలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఆసిన్:గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన హీరోయిన్ ఆసిన్ కూడా 2017 లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది.
హన్సిక:దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక.ఈమె తన చిన్ననాటి ప్రియుడు అయినా సోహెల్ ను డిసెంబర్ 4 న పెళ్లి చేసుకోబోతుందని సమాచారం.వీరిద్దరూ కలిసి ఒక ఈవెంట్ మానేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నట్లు సమాచారం.
Source link