YSRCP Vs TDP : ఎల్లో టీమ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేసిన వైసీపీ..


YSRCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగింది. కూటమి వ్యూహాలతో జగన్ అలర్ట్ అయ్యారు. షెడ్యూల్ తరువాత గేమ్ మార్చారు. గెలుపైన వైసీపీలో అంచనాలు మారుతున్నాయి. ఇక ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ భావించి జోరుగా ప్ర‌చారాలు చేశారు. .జగన్ వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. ఇక పొత్తులను తాము ముందుగానే ఊహించామని చెప్పారు. తాము అంచనా వేసిన సీట్ల కంటే పొత్తులతో కూటమిగా ఆ మూడు పార్టీలు బరిలోకి దిగిన తరువాత క్షేత్ర స్థాయిలో తమకు మరింత మద్దతు కనిపిస్తుందని వివరించారు. గతంలో అనుకున్న సంఖ్య కంటే ఇంకా అధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేసారు. జగన్ మూడు రాజధానులకు కట్టుబడి వున్నారని చెప్పారు సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చిన జగన్ రాయలసీమలో కీలక మార్పులు చేశారు. 52 నియోజకవర్గాల్లో 2019లో టిడిపిని కేవలం మూడు సీట్లకే పరిమితం చేసిన జగన్.. ఈసారి ఎన్నికల్లోను అదే పట్టు కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అటు టిడిపి సైతం తమ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తుంది. రెండు జిల్లాల్లో రెండు పార్టీల మధ్య పోటాపోటీగా ఎన్నికల యుద్ధం సాగుతున్నట్లు గ్రౌండ్ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. జగన్ రాయలసీమ జిల్లాల్లో ఈ సారి కొత్త వ్యూహంతో అడుగులు వేశారు. సీనియర్ నేతలకు జగన్ బాధ్యతలు అప్పగించారు.

YSRCP Vs TDP who will win this time
YSRCP Vs TDP

కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ సీమ జిల్లాలో కీలకంగా మారుతుంది. దీంతో ప్రత్యర్థి పార్టీల బలహీనతలను తనకు అవకాశం గా మల్చుకుంటున్నారు. రాయలసీమలోని 52 స్థానాల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవడం ద్వారా అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు చేరువ కావాలనేది జగన్ లక్ష్యం..అయితే జ‌గ‌న్ ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు, వాలంట‌రీ వ్య‌వ‌స్థ కూడా ఆయ‌న‌కి అనుకూలంగా మారేలా క‌నిపిస్తుంది. గ‌త రెండు నెల‌ల్లో సామాజిక పెన్ష‌న్స్ వాలంటీర్స్ ద్వారా పంపిణీ కాకుండా చేసినందుకు కూట‌మిపై ఏపీ ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. మరి ఓట‌రు చివ‌రికి ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *