Venu Swamy : అక్కినేని హీరో అఖిల్ ఎంత కష్టపడి సినిమాలు చేసిన కూడా మంచి విజయాలు అందుకోలేకపోతున్నాడు. చేసిన సినిమాలలో ఒక్క సినిమా కూడా పెద్ద హిట్ కాకపోవడంతో కొందరు అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. క్రమంలోనే అఖిల్ ని ఏకీపారిస్తున్నారు జనాలు . సోషల్ మీడియాలో అఖిల్ అక్కినేని సినిమాలకు పనికిరాడు అంటూ బూతులు తిడుతూ ఉండడం గమనార్హం . ఈ క్రమంలోనే వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు . రీసెంట్గా అఖిల్ జాతకాన్ని బయటపెట్టిన వేణు స్వామి ఆయనకు హిట్ పడాలంటే అదొక్కటే మార్గం అంటూ పెద్ద బాంబే పేల్చాడు.
గతంలో నాగచైతన్య సమంత విడిపోతారు అంటూ తెగ వార్తలలో నిలిచారు. ఆయన చెప్పిన కొన్నాళ్లకే అది జరగడంతో వేణు స్వామి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక చాలా మంది సెలబ్రిటీస్ విషయాలల్లో చెప్పింది తూచా తప్పకుండా జరిగింది . ఇప్పుడు అఖిల్ ఏజెంట్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. అఖిల్ కు వరుసగా ఫ్లాపులు రావడానికి ఒక విధంగా ఆయన అమల కారణమని వేణుస్వామి అన్నారు.అఖిల్ జాతకంలో నాగ దోషం ఉందని అఖిల్ డైరెక్ట్ గా సినిమాలు చేయాలని ఎవరి నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన సూచించారు.ఆయన జాతకంలో తల్లి పాత్ర ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు.
తల్లి ఇంపాక్ట్ వల్ల అఖిల్ జీవితం వెనక్కు లాగబడుతుందని అమల వెనక్కి తగ్గితే అఖిల్ కు బెనిఫిట్ కలుగుతుందని తాను జాతకం పరంగా చెబుతున్నానని వేణుస్వామి స్పష్టం చేశారు. మరి ఇది అఖిల్ ఏమైన వింటాడా లేదా అనేది చూడాలి. ఇక సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ చిత్రం తొలి షో నుండే నెగెటివ్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాకు అఖిల్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారని సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో వాటా తీసుకునే విధంగా అఖిల్ ఒప్పందం కుదుర్చుకున్నారని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ కావడంతో అఖిల్‌కి రెమ్యునరేషన్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Source link