
Varun Tej Lavanya Tripathi: హైదరాబాద్ లో మణికొండలో ఉన్న నాగబాబు ఇంట్లో ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి,మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.ఈ వేడుక కొద్దిపాటి బంధువులు మిత్రువుల సమక్షంలో జరిగింది.గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురించి సోషల్ మీడియాలో చాల వార్తలు వైరల్ అయ్యాయి.వారిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు అప్పట్లో చాల వార్తలు చక్కర్లు కొట్టిన అవన్నీ నిజం కాదని వాళ్ళు తేల్చి చెప్పేసారు.
ఆ తర్వాత కూడా వీరి గురించి వార్తలు వచ్చిన వీరు స్పందించడం మానేశారు.ఫైనల్ గా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిన వీరిద్దరూ ఎంగేజ్మెంట్ జూన్ 9 న నాగబాబు ఇంట్లో ఘనంగా చేసుకున్నారు.వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు కూడా గత కొన్ని రోజుల ముందే అధికారికంగా ప్రకటించటంతో మెగా ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.

వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడుకకు నాగబాబు తల్లి అంజనా దేవి,చిరంజీవి,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్,అల్లు అర్జున్,అల్లు శిరీష్,అల్లు బాబీ,సాయి ధరమ్ తేజ్,వైష్ణవ తేజ్ వంటి పలువురు హాజరు అయ్యారు.వీరిద్దరి పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు.మై లవ్ అంటూ వరుణ్ తేజ్ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
1.
2.
3.
4.
5.
6.
Source link