SRH : ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తృటిలో కప్ చేజార్చుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఓడి టైటిల్ కోల్పోయింది. ఇక IPL సీజన్ 17 ముగిసిన వెంటనే, IPL 2025 చర్చలు ప్రారంభమయ్యాయి. ఆటగాళ్ల రిటెన్షన్ అంశంతోనే ఈ చర్చలు ప్రారంభం కావడం విశేషం. అంటే ఐపీఎల్ 2025కి మెగా వేలం జరగనుంది. ఈ మెగా వేలానికి ముందే ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈసారి కొందరు ఫ్రాంచైజీలు 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించాలని బీసీసీఐని అభ్యర్థించారు. అంటే, 2022లో జరిగిన మెగా వేలంలో కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అనుమతించారు. అలాగే, ఈ రిటెన్షన్ కోసం కొన్ని షరతులు విధించారు.
షరతుల ప్రకారం ఒక జట్టు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే, రూ.42 కోట్లు ఖర్చవుతుంది. ముగ్గురిని రిటైన్ చేసుకుంటే రూ.33 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ. 24 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క ఆటగాడిని రిటైన్ చేసుకుంటే రూ. 14 కోట్లు ఇవాల్సి ఉంటుంది.4 ఆటగాళ్లను రిటైన్ చేస్తే: 1వ ఆటగాడు రూ.16 కోట్లు, 2వ ఆటగాడు రూ.12 కోట్లు, 3వ ఆటగాడు రూ.8 కోట్లు, 4వ ఆటగాడు రూ.6 కోట్లు మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే, దీని ప్రకారం మొత్తం రూ.42 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్ఆర్ హెచ్ వచ్చే సీజన్ కోసం కసరత్తులు చేస్తుంది. ఈ సారి సరిగ్గా రాణించలేకపోయిన వారిపై వేటు వేయాలని భావిస్తుంది.
సమద్, మయాంక్ అగర్వాల్, మార్క్రరమ్, ఫిలిప్స్, మార్కో జాన్సన్, యువ క్రికెటర్స్ అనుమోల్ ప్రీత్ సింగ్, సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌ని సన్‌రైజర్స్ విడిచిపెట్టబోతుందని ఓ టాక్ నడుస్తుంది. చూడాలి మరి వీరి విషయంలో ఎస్ఆర్‌హెచ్ జట్టు ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందా అనేది. ఇక ఈ సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ జట్టు ఓటమితో ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ జట్టు సహ యాజమాని కావ్య మారన్ సైతం జట్టు ఓటమి తరువాత స్టేడియంలోనే కన్నీరు పెట్టుకున్నారు. ఓటమితో తీవ్ర నిరాశకు గురైన ఆటగాళ్లు మైదానంవీడి నేరుగా డ్రెస్సింగ్ రూంకు వెళ్లారు.
The post SRHలో ఇకపై ఈ ప్లేయర్లు ఉండరు.. టాటా చెప్పేసినట్లే..? appeared first on Telugu News 365.
Source link