Sreeja : రెమ్యున‌రేష‌న్‌తో శ్రీజ‌కి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. ఎన్ని కోట్లంటే..?


Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు త‌న ప్రేమ పెళ్లిళ్ల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలిచింది. బిజినెస్ ఫ్యామిలీకి చెందిన కల్యాణ్ దేవ్, శ్రీజ వివాహం 2016లో జరిగింది. శ్రీజ పెళ్లిని తమ కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా జరిపించారు. శ్రీజతో వివాహం తర్వాత కల్యాణ్ దేవ్ 2018లో విజేత చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అయితే 2019 తర్వాత శ్రీజతో విభేదాల కారణంగా మెగా ఫ్యామిలికి కల్యాణ్ దేవ్‌ దూరం అయినట్టు సమాచారం.అంత‌క‌ముందు భ‌రద్వాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకోగా, అత‌నికి కొన్ని రోజుల‌కే విడాకులు ఇచ్చింది.

ప్ర‌స్తుతం శ్రీజ త‌న ఇద్ద‌రు పిల్ల‌లతో చిరంజీవి ద‌గ్గ‌రే ఉంటున్న‌ట్టు తెలుస్తుండ‌గా, తాజాగా చిరంజీవి త‌న చిన్న కూతురు శ్రీజకు ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సమాచారం.ఈ ఇంటి విలువ ఏకంగా 35 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. కూతురిపై ఉన్న మమకారంతో చిరంజీవి ఈ ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చినట్టు బోగట్టా.ప్రస్తుతం తను హీరోగా తెరకెక్కుతున్న సినిమాల నిర్మాతల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్లతో చిరంజీవి శ్రీజకు ఈ ఇంటిని బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో చిరంజీవి విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

chiranjeevi reportedly given costly gift to Sreeja
Sreeja

చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఈ సినిమాల‌కి వ‌చ్చిన రెమ్యున‌రేష‌న్‌తోనే ఇల్లు కొనుగోలు చేశాడ‌ని అంటున్నారు. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ కూడా శ్రీజపై ఎంతో మ‌మ‌కారం చూపిస్తాడు. ఆ మధ్యన శ్రీజ డిప్రెషన్ లో ఉంటే రాంచరణ్ వెకేషన్ కి తీసుకువెళ్లాడు. ఇక గతంలో చెల్లెళ్లకు స్థలాలను బహుమతిగా ఇచ్చిన చిరంజీవి కూతురికి కూడా ఖరీదైన కానుక ఇవ్వగా నాన్న ఇచ్చిన బహుమతిని చూసి శ్రీజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయ‌ట‌.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *