Sr NTR Wedding Card : ఎన్టీఆర్ వివాహం ఎప్పుడు, ఎక్క‌డ జ‌రిగింది.. వైర‌ల్ అవుతున్న పెళ్లి ప‌త్రిక‌..


Sr NTR Wedding Card : తెలుగు సినిమాకి రెండు క‌ళ్లు ఉంటే అవి ఎన్టీఆర్,ఏఎన్ఆర్ అని చెప్పాలి. వీరిద్ద‌రు తెలుగు సినిమా ఖ్యాతిని ఎంత‌గానో పెంచారు. ఎన్టీఆర్ న‌టుడిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కుడిగాను స‌త్తా చాటారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ వేరు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం ఆఖర్లో వివాదాస్పదం అయిన విష‌యం మ‌నందరికి తెలిసిందే. ముందు నుంచి ఎన్టీఆర్ విషయంలో ఎన్నో అంశాలు చాలా ఆదర్శంగా ఉండేవి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన విధానమే అప్పట్లో ఒక సంచలనంగా మారింది.

ఇక ఎన్టీఆర్… బసవతారకం ను వివాహం చేసుకోగా, వారి పెళ్ళికి అయిన ఖర్చు, శుభలేఖ ఇలా ఎన్నో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కొమరవోలుకి చెందిన తన మేనమామ కుమార్తెనే ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. అలా పెళ్ళికి ముందు ఇచ్చిన శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్, బసవతారకం వివాహ పత్రికలో భాష అంతా కూడా చాలా వరకు గ్రాంథికంలోనే ఉంటుంది.. వీరి పెళ్లి కొమరవోలు గ్రామంలో జరగగా… ఈ పత్రికను గుడివాడ శ్రీ బాల సరస్వతి ప్రెస్ లో ముద్రించారు.

Sr NTR Wedding Card viral on social media
Sr NTR Wedding Card

ఈ పెళ్లి పత్రిక‌ను పెళ్లి కుమార్తె తండ్రి కాట్ర‌గ‌డ్డ చెంగ‌య్య ప్రింట్ చేయించారు. ఎన్టీఆర్ వివాహం ఏప్రిల్ 22, 1942 లో జరగగా… 1985 లో బసవతారకం క్యాన్సర్ తో మరణించారు. ఇప్పటి మాదిరిగా దాని మీద ప్ర‌త్యేక‌ డిజైన్ లు అవేమి లేవు. అవసరమైన మేటర్ మాత్రమే రాసి… ఆహ్వానం పంపించారు. ఈ శుభలేఖ ఇప్పటికీ నందమూరి బాలకృష్ణ ఇంట్లో ఉందని స‌మాచారం. ఎన్టీఆర్ తండ్రి పేరు నందమూరి రామయ్య చౌదరి.1942 మే 2వ తేదీన బసవరమతారకం, ఎన్టీఆర్ పెళ్లిని ఆయ‌న ఎంతో ఘ‌నంగా జ‌రిపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *