
Skanda: గత సినిమాలకు భిన్నంగా ఊర మాస్ లుక్ లో రామ్ పోతినేని ప్రేక్షకుల ముందుకు వస్తున్నా సినిమా స్కంద.కంప్లీట్ యాక్షన్ సన్నివేశాలతో,పంచ్ డైలాగులతో ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొనేలా చేసింది.ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ ట్రైలర్ ను చూసి అందరు ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు.ఖచ్చితంగా ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ ఉంటాయని,మాస్ ప్రేక్షకులను ఈ సినిమా కట్టిపడేస్తుంది ఇక ఈ సినిమా బిజినెస్ పరంగా భీభస్తమ్ సృష్టిస్తుందని టాక్ నడుస్తుంది.అయితే ఈ సినిమా కథ మొదట వేరే హీరో దగ్గరకు వెళ్లిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా కథను మొదట బోయపాటి శ్రీను మహేష్ బాబు కు వినిపించారట.ఈ సినిమా కథను విన్న తర్వాత మహేష్ ఈ సినిమాకు నో చెప్పారని వినిపిస్తుంది.
కథలో మార్పులు చేర్పులు చేసిన కూడా తన బాడీ లాంగ్వేజ్ కు తన ఇమేజ్ కు అంత ఊర మాస్ సినిమా వర్క్ అవుట్ కాదని మహేష్ ఈ సినిమాను రిజెక్ట్ చేసారంట.అలా ఈ సినిమా కథను తర్వాత రామ్ పోతినేని కి వినిపించారట.ఇక ఈ సినిమా మిర్చి సినిమా తరహాలో ఫస్ట్ హాఫ్ లో సాఫ్ట్ గా సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని సమాచారం.ఇక మహేష్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ ఆ కదా అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ సినిమా యెంత పెద్ద హిట్ అయినా కూడా ఈ కథ మహేష్ కు నప్పదు కాబట్టి మహేష్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటూ నెటిజన్లు అభిప్రాయం పడుతున్నారు.ఇక టాలీవుడ్ లో రవితేజ హీరో గా చేసిన భద్ర సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన బోయపాటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.బోయపాటి,బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమా లు ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ లిస్ట్ లో చేరాయి.ఇక చివరగా బోయపాటి నటించిన అఖండ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికి తెలిసిందే.అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
Source link