Samantha: వెకేషన్ లో తన ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న సమంత..ఫోటోలు వైరల్


Samantha

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.ఇదివరకు సమంత కొత్త సినిమాలు ఏవి కొంత సమయం వరకు ఒప్పుకోను.ప్రస్తుతం ఉన్నవి పూర్తి చేసి కొన్ని నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాను అని ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం అదే పని చేస్తుంది సమంత.విజయ్ దేవరకొండతో కలిసి ఈమె చేస్తున్న సినిమా ఖుషి ఇటీవలే పూర్తి అయ్యింది.ఇక సమంత చేస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్ కూడా పూర్తి అవ్వడం జరిగింది.

దాంతో ముందుగా అన్నట్టుగానే కొత్త సినిమాలు ఏవి ఒప్పుకొని సమంత ప్రస్తుతం వెకేషన్ లో తన స్నేహితురాలు అనూష స్వామి తో కలిసి బాలి పట్టణంలో ఎంజాయ్ చేస్తుంది.బాలిలో ఉన్న ప్రదేశాలు అన్ని సమంత తన ఫోన్ లో ఫోటోలు తీసి సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంది.ప్రస్తుతం ఇదే క్రమంలో ఈ రోజు సమంత షేర్ చేసిన కొన్ని ఇంటరెస్టింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ రోజు ఈ స్నేహితులు ఇద్దరు కలిసి బాలిలోని కోతుల ఫారెస్ట్ కి వెళ్లి అక్కడ కోతులతో ఆడుకున్నారు.ఈ కోతుల ఫారెస్ట్ అక్కడ బాలిలో చాల ఫేమస్ అని తెలుస్తుంది.ప్రస్తుతం సమంత చేతిలో సినిమాలు ఏవి లేకుండా విశ్రాంతి తీసుకోవడానికి ఇండోనేసియా వెళ్లినట్లు తెలుస్తుంది.సమంత కు మాయోసైటిస్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ వ్యాధి తగ్గుముఖం పట్టిన సమయంలో సమంత మధ్యలో ఆపేసిన సినిమాలు విశ్రాంతి లేకుండా పూర్తి చెయ్యడంతో,ఈ వ్యాధి మల్లి ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో సమంత విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నట్లు తెలుస్తుంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *