Ram Gopal Varma : హైదరాబాద్ అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో మరణించిన నాలుగేళ్ల ప్రదీప్ మరణంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. గతంలో తన పెంపుడు కుక్కకు ఆహారం పెడుతున్న మేయర్ గద్వాల విజయలక్ష్మీ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి సంచలన కామెంట్స్ చేశారు. మేయర్ విజయలక్ష్మీ ఆ కుక్కలను ట్రైన్ చేసి పిల్లలను చంపించడానికి ప్రయత్నం చేసిందనే అనుమానం నాలో మొదలైంది. మేయర్ విజయలక్ష్మిని హైదరాబాద్ పోలీసులు ఈ విషయంలో విచారించాలని కేటీఆర్‌ను కోరుతున్నాను అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక తాజాగా ఓ టీవీ ఛానల్ కుక్కల దాడి ఘటనపై డిబేట్ నిర్వహించగా ఆ చర్చలో వర్మ పాల్గొన్నారు. బాలుడి మృతి విషయంలో ఎవరు బాధ్యులు అనే అంశం మీద చర్చ పెట్టగా.. ఈ చర్చలో వర్మతో పాటు బాధితులు, జంతు ప్రేమికులు, మేయర్ మద్దతుదారులు కూడా పాల్గొన్నారు. జంతుప్రేమికులు మాట్లాడుతూ.. ఇది పూర్తిగా తల్లిదండ్రుల నిర్లక్ష్యమే అని స్టేట్మెంట్ ఇచ్చారు. పిల్లాడ్ని నిర్లక్ష్యంగా వదిలేసిన తల్లిదండ్రులదే తప్పు అని జంతు ప్రేమికులు అంటున్నారు. దీనిపై బాధితులు ఫుల్ ఫైర్ అయ్యారు. వర్మ కూడా జంతు ప్రేమికులపై సీరియస్ అయ్యారు. కొడుకు పోయిన బాధలో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి కోపంగా వాళ్లు మాట్లాడతారు. మేయర్ ని అడగాల్సింది పోయి తప్పుని తల్లిదండ్రుల మీద తోసేస్తారేంటి అని వర్మ సీరియస్ అయ్యారు.
ఈ డిబేట్ లోకి తనను ఎందుకు పిలిచారో, బాధితులను ఎందుకు పిలిచారో, జంతు ప్రేమికులను ఎందుకు పిలిచారో తెలియదు కాని, వాళ్ళనైనా పొమ్మనండి, లేదా నేనైనా పోతాను అని సీరియస్ అయ్యారు. సొల్యూషన్ లేని దానికి ఇంత డిస్కషన్ అనవసరం అని లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అయితే మిగతా వారు ఆయనని ఆపే ప్రయత్నం చేశారు. మానవత్వంపై వర్మ ఇంత ఎమోషనల్ గా ఎప్పుడు మాట్లాడడం చూడలేదని,ఆయనకే మా సపోర్ట్ అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. మొత్తానికి వర్మ స్పందనతో ఈ విషయం చాటా హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి.
Source link