Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్.ప్రభాస్ పెళ్లి కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల తో పాటు పాన్ ఇండియా అభిమానులు ఎదురు చూస్తున్నారు.ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అంటూ ఆయన అభిమానులు ఎదురు చూస్తుంటే మరో పక్క ప్రభాస్ మాత్రం పెళ్లి ఊసు ఎత్తకుండా తన పని తానూ చేసుకుంటూ వెళ్తున్నాడు.వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు ప్రభాస్.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అన్ని కూడా భారీ బడ్జెట్ సినిమాలే ఉన్నాయి.అప్పట్లో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని చాల వార్తలు వినిపించాయి.అయితే ఆ సినిమా వచ్చి ఇన్ని ఏళ్ళు అయినా కూడా ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి మాట్లాడటం లేదు.ఇటీవలే బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో లో కూడా తన గురించి అడిగితె మాటను దాటేశాడు ప్రభాస్.
ఎప్పటి నుంచో ప్రభాస్ పెళ్లి గురించి ఎదురు చూస్తున్న అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్ అనుష్క తో డార్లింగ్ పెళ్లి చేసేసారు.ప్రభాస్,అనుష్క కు పెళ్లి జరిగినట్లు ఆర్టిఫిషల్ ఫొటోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియా లో షేర్ చేయడం తో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రభాస్ అనుష్క పెళ్లి ఫోటోలు ఏఐ పిక్స్ చాల అందంగా ఉన్నాయి.వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ చుస్తే నిజమేనా అనే సందేహం కూడా కలుగుతుంది అందరికి.
View this post on Instagram
Source link